మహాకూటమి ఓ దుష్టచతుష్టయం: కవిత

By narsimha lodeFirst Published Sep 19, 2018, 1:28 PM IST
Highlights

మహాకూటమి ఒక దుష్టచతుష్టయమని నిజామాబాద్ ఎంపీ కవిత విమర్శించారు.


నిజామాబాద్: మహాకూటమి ఒక దుష్టచతుష్టయమని నిజామాబాద్ ఎంపీ కవిత విమర్శించారు.తెలంగాణపై ప్రేమ లేని పార్టీలన్నీ కూటమిగా వస్తున్నాయని... ఈ పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలని  కవతి ప్రజలకు సూచించారు. 

నిజామాబాద్ లో పోచమ్మ గల్లీ లో మట్టి గణపతి కి  బుధవారం నాడు  ఎంపీ కవిత పూజలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. దుర్యోధనుడు దుశ్హాసనుడు కర్ణుడు శకుని ఈ పాత్రలు కూటమిలో ఎవరెవరు అనేది వారే తేల్చుకోవాలన్నారు. 

తెలంగాణ మీద ప్రేమ లేని పార్టీలు కూటమిగా వస్తున్నాయన్నారు. ఈ కూటమి పేరుతో వస్తున్న పార్టీల కుట్రలను  ప్రజలు తిప్పి కొడతారని ఆమె అభిప్రాయపడ్డారు. 
అభిషేక్ సింఘ్వీ తెలంగాణలో  70 లక్షలు ఓట్ల గల్లంతయ్యాయయని అంటే ఉత్తమ్ 20 లక్షలు అంటున్నారు ఇందులో ఏది సరైందో వారికే క్లారిటీ లేదన్నారు.

ఓట్ల వ్యవహారం ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందన్నారు.  ఓట్ల గల్లంతులో కేసీఆర్  పాత్ర ఉందంటే అర్థం ఉందా అని ఆమె ప్రశ్నించారు. అయినా కాంగ్రెస్ పార్టీకి కోర్టులకు వెళ్ళడం చీవాట్లు పడటం అలవాటేనని చెప్పారు.టీడీపీ,  కాంగ్రెస్ పొత్తు అనైతికమన్నారు. టీడీపీ కాంగ్రెస్ లు తెలంగాణ జనాలను పీడించాయన్నారు.  ఇలాంటి పీడన పార్టీలతో తెలంగాణ జన సమితి కూడా మహాకూటమితో జట్టు కట్టడం హాస్యాస్పదమని ఎంపీ కవిత అభిప్రాయపడ్డారు.
 

click me!