నిజామాబాద్ పర్యటనలో ఎంపీ కవిత బిజిబిజీ...

By Arun Kumar PFirst Published Feb 14, 2019, 9:12 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట కవిత ఇవాళ నిజామాబాద్ లో బిజీ బిజీ గా గడిపారు. ఇటీవలే ఉత్తమ ఎంపీగా ఎంపికైన ఆమె ప్రజల నుండి అభినందనలు అందుకున్నారు. అలాగే నూతనంగా ఎన్నికయిన టీఆర్ఎస్ సర్పంచ్, వార్డు  మెంబర్లకు ఆమె అభినందనలు తెలిపారు. ఈ విధంగా కవిత నిజామాబాద్ పర్యటన ఉత్సాహభరితంగా సాగింది. 

మొదట జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశంలో కవిత పాల్గొన్నారు. బిఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ విస్తరణ, సేవల్లో నాణ్యత పెంపు,  ఆదాయం పెంచుకునే విషయాలపై అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు. అలాగే బాన్సువాడలో 4జి సేవలను అక్కడి నుండే ప్రారంభించారు.

అనంతరం జిల్లా కలెక్టరేట్‌ ప్రగతిభవన్ మైదానంలో మత్స్యకార కుటుంబాలకు వాహనాలు, వలలు, విక్రయ కియోస్క్‌లతో పాటు వివిధ పనిముట్లను పంపిణీ చేశారు. తర్వాత రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో బీసీ లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.  అలాగే కలెక్టర్ ఆఫీస్ లో నిజామాబాద్ మున్సిపల్ అభివృద్ధి పనులు, నగర ప్లానింగ్ ఇతర సమస్యలపైన అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. 

టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు శుభకార్యాల్లో కూడా కవిత పాల్గొన్నారు. మొదట ఓ టిఆర్ఎస్వి నాయకుని ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరైన ఆమె ఆ తర్వాత ఓ మండల స్థాయి నాయకుడికి సంబంధించిన వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

అనంతరం ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున సర్పంచులు, వార్డు సభ్యులుగా గెలిచిన వారిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారందరికి  తన ఆఫీసు వద్దే భోజనాలను ఏర్పాటు చేశారు. వీరందరికి  ఎంపీ కవిత అభినందనలు తెలిపారు.   

click me!