లిఫ్ట్ ఇచ్చిన పాపానికి.. పెట్రోల్ పోసి నిప్పంటించారు.. !

Published : Feb 02, 2021, 12:15 PM IST
లిఫ్ట్ ఇచ్చిన పాపానికి.. పెట్రోల్ పోసి నిప్పంటించారు.. !

సారాంశం

లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తినే దారుణంగా చంపేసిన ఘటన హైదరాబాద్ బాలాపూర్ లో జరిగింది. ఆదివారం రాతరి బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తినే దారుణంగా చంపేసిన ఘటన హైదరాబాద్ బాలాపూర్ లో జరిగింది. ఆదివారం రాతరి బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లెలగూడకు చెందిన బి.హరీష్‌ (28) ఓ ఫైనాన్స్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి 2గంటల సమయంలో ఎల్బీనగర్ లో సెకండ్ షో సినిమా చూసి ఇంటికి బయల్దేరాడు. 

టూవీలర్ పై వెల్తున్న అతడ్ని గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడగడంతో జిల్లెలగూడ వైపే అనడంతో లిఫ్ట్ ఇచ్చాడు. అయితే ఆ వెనక కూర్చున్న వ్యక్తి మందమల్లమ్మ చౌరస్తా వరకూ రాగానే చాంద్రాయణ గుట్టలో అర్జెంట్ పని ఉందని అక్కడివరకు వదిలేయమని బతిలాడాడు. సరే అని అతన్ని అక్కడిదాకా వదిలేసి తిరిగి జిల్లెలగూడకు బయల్దేరాడు.

మార్గమధ్యలో మరో వ్యక్తి బాలాపూర్‌ వరకు లిఫ్ట్‌ అడగడంతో ఎక్కించుకున్నాడు. అతను సుల్తాన్ పూర్ గ్రామంలో  తమ బంధువుకు సీరియ్‌స్ గా ఉందని అక్కడ దించాలని హరీష్ ను బతిలాడాడు. దీంతో హరీష్ అతన్ని అక్కడికి తీసుకెళ్లాడు.

అక్కడికి వెళ్లగానే ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. బైక్ కింద పడేసి అతనిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి పరారయ్యారు. ఈ విషయాన్ని తెల్లవారుజామున 4 గంటల సమయంలో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న బాలాపూర్‌ పోలీసులు చికిత్స నిమిత్తం అతడిని ఉస్మానియాకు తరలించారు.

బాధితుడి కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధితుడు చెబుతున్నది నిజమేనా? లిఫ్ట్‌ ఇచ్చాడా.. లేదా..? ఏం జరిగి ఉంటుంది..? అని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నట్లు బాలాపూర్‌ పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

ఉగాది పంచాంగ శ్రవణం కేటీఆర్ జాతకం చెప్పిన పండితులు KTR Attend Ugadi Celebrations | Asianet Telugu
Kavitha Kalvakuntla: డాడీ, మోడీ, చిన్న మోడీపైనే నా పోరాటం: కవిత సెటైర్లు | Asianet Telugu