రోడ్డు ప్రమాదం.. నవ దంపతులు దుర్మరణం

Published : Feb 02, 2021, 11:30 AM IST
రోడ్డు ప్రమాదం.. నవ దంపతులు దుర్మరణం

సారాంశం

మాచారెడ్డి మండ‌ల ప‌రిధిలోని ల‌క్ష్మీదేవునిప‌ల్లి వ‌ద్ద ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వ‌చ్చిన కారు అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది.

రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు దుర్మరణం పాలయ్యారు. మాచారెడ్డి మండ‌ల ప‌రిధిలోని ల‌క్ష్మీదేవునిప‌ల్లి వ‌ద్ద ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వ‌చ్చిన కారు అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో కారులో ప్ర‌యాణిస్తున్న న‌వ దంప‌తులు మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. 

మృతుల‌ను ప్ర‌వీణ్‌(25), రేణుక‌(24)గా పోలీసులు గుర్తించారు.  బాల‌వ్వ‌, ల‌క్ష్మీ, అఖిల‌(14)కు తీవ్ర గాయాల‌వ‌డంతో వారిని చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతులు దోమ‌కొండ మండ‌లం ముత్యంపేట గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బాధిత కుటుంబ స‌భ్యులు మాచారెడ్డి మండ‌లం ఎల్పుగొండ‌లో నివాస‌ముంటున్నారు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.
Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం