ఒకే కాన్పులో నలుగురు పిల్లలలకు జన్మనిచ్చిన తల్లి... (వీడియో)

By AN TeluguFirst Published Aug 21, 2021, 1:16 PM IST
Highlights

కరీంనగర్ లోని యశోద ఆస్పత్రిలో ఓ యువతి నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఆమెకు వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తో డెలివరీ చేశారు. కరీంనగర్లోని మంకమ్మ తోట కి చెందిన యశోద కృష్ణ హాస్పిటల్ లో డాక్టర్ ఆకుల శైలజా ఆధ్వర్యంలో నాగుల మల్యాల గ్రామానికి చెందిన సాయి క్రిష్ణ, నిఖిత దంపతులకు నలుగురు పిల్లలు జన్మించారు.

కరీంనగర్ : సాధారణంగా కవలపిల్లలు జన్మిస్తే అబ్బురంగా చూస్తాం.. అదే ట్రిపులేట్స్ అయితే.. విస్మయం చెందుతాం. ఇక అంతకు మించి.. ఒకే కాన్పులో నలుగురు పుడితే... అమ్మో.. అంటూ నోట మాటరాదు. ఇలాంటి అశ్చర్యకరమైన ఘటనే కరీంనగర్ లో చోటు చేసుకుంది. 

"

కరీంనగర్ లోని యశోద ఆస్పత్రిలో ఓ యువతి నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఆమెకు వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తో డెలివరీ చేశారు. కరీంనగర్లోని మంకమ్మ తోట కి చెందిన యశోద కృష్ణ హాస్పిటల్ లో డాక్టర్ ఆకుల శైలజా ఆధ్వర్యంలో నాగుల మల్యాల గ్రామానికి చెందిన సాయి క్రిష్ణ, నిఖిత దంపతులకు నలుగురు పిల్లలు జన్మించారు.

నిఖిత కి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటి నుంచి డాక్టర్ ఆకుల శైలజ వద్ద
చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఉదయం 10 గంటలకి సిజేరియన్ ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. దీంతో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు ఒకే కాన్పులో జన్మించడంతో కరీంనగర్లో ఆసక్తిగా చర్చ జరుగుతుంది.

కాగా డాక్టర్లు మాట్లాడుతూ నిఖిత, ఆమె సోదరి కూడా ట్విన్సేనని తెలిపారు. అంతేకాదు.. ఆమె సోదరికి ఇంతకుముందు ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టగా.. నిఖితకు ఒకే కాన్పులో నలుగురు పుట్టడం ఆశ్చర్యం అని... ఇది ఎనిమిది లక్షల మందిలో ఒక్కరికి ఇలా జరుగుతుందని.. అన్నారు. 

click me!