వేములవాడ రాజన్నను దర్శించుకున్న ‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తా... పా’ జంట...(వీడియో)

Published : Aug 21, 2021, 10:32 AM IST
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తా... పా’ జంట...(వీడియో)

సారాంశం

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఇటీవల నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తా... పా  అనే పాటకు డాన్స్ చేసిన పెళ్లి కూతురు సాయి శ్రీజ, అశోక్ దంపతులు శుక్రవారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. 

‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తా... పా’ అంటూ ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసిన ఓ వధువు ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయింది. వరుడి ముందు ఆమె చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఫిదా చేసింది. ఆ జంట ఎక్కడ కనిపించినా సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇప్పుడీ జంట రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో సందడి చేశారు.

"

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఇటీవల నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తా... పా  అనే పాటకు డాన్స్ చేసిన పెళ్లి కూతురు సాయి శ్రీజ, అశోక్ దంపతులు శుక్రవారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. 

అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా సాయి శ్రీజ మాట్లాడుతూ, వేములవాడ రాజన్న తమకు ఇలవేల్పు అని, పెళ్లయిన తర్వాత రాజన్న దర్శనానికి వచ్చిన తమకు అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తన పెళ్లి భరత్ లో చేసిన డ్యాన్స్ విపరీతంగా వైరల్ కావడం తనకు ఆనందాన్ని కలిగించిందని ఆమె చెప్పారు.
 
PREV
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu