ప్రియుడి మోజులో కన్నప్రేమను మరిచి... నాలుగేళ్ల కూతుర్ని చంపిన కసాయి తల్లి

By Arun Kumar P  |  First Published Jul 12, 2023, 11:45 AM IST

H


హైదరాబాద్ : ప్రియుడి మోజులో కన్నప్రేమను మరిచిందో కసాయి మహిళ. తన సుఖం కోసం కన్నతల్లే ముక్కుపచ్చలారని చిన్నారిని చిదిమేసింది. అమ్మతనానికే మచ్చతెచ్చే ఈ అమానుషం హైదరాబాద్ లో చోటుచేసుకుంది.  

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ శివారులోని కుషాయిగూడ ప్రాంతంలో నివాసముండే రమేష్, కళ్యాణి భార్యాభర్తలు. వీరికి నాలుగున్నరేళ్ల తన్విత సంతానం. పెళ్లయిన తర్వాత కొన్నేళ్లు వీరి సంసారం సాఫీగానే సాగింది. రెండేళ్ళ క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్దలు రావడంతో విడిపోయారు.దీంతో కూతురు తన్విత తల్లివద్దే వుండగా రమేష్ మాత్రం వేరేచోట వుంటున్నారు. కళ్యాణి కూరగాయలు అమ్ముకుంటూ కుషాయిగూడ మార్కెట్ సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకుని వుంటోంది. 

Latest Videos

అయితే జనగామ జిల్లాలోని తన స్వస్థలం జరిగిన ఓ వేడుక కోసం కూతురితో కలిసి వెళ్ళింది కళ్యాణి. ఈ సమయంలోనే బచ్చన్నపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఇండ్ల నవీన్ కుమార్(19) అనే యువకుడితో కళ్యాణికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ బంధువులే కావడంతో తరచూ కలుస్తుండేవారు. తరచూ హైదరాబాద్ కు వస్తూ కళ్యాణిని ఆమె ఇంట్లోనే కలవడం ప్రారంభించాడు నవీన్. ఇలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. చాలాకాలంగా వీరిద్దరూ ఇలా వివాహేతర బంధాన్ని సాగిస్తున్నారు. 

Read More  హైద్రాబాద్‌లో చైల్డ్ ఫోర్న్ వీడియోలు షేర్ చేస్తున్న ఎంసీఏ స్టూడెంట్‌: అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్రియుడు నవీన్ తో జీవితాన్ని పంచుకోవాలని భావించిన కళ్యాణి పెళ్లి చేసుకోవాలని అడిగింది. కానీ ఇప్పటికే కూతురు వున్న ఆమెను పెళ్లాడేందుకు ప్రియుడు నిరాకరించాడు.  దీంతో కూతురు అడ్డు తొలగించుకుని భావించింది కసాయి తల్లి. నిద్రలో వున్న కూతురి ముఖంపై దిండు అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి అతి దారుణంగా చంపింది. ఆ తర్వాత అనారోగ్యంతోనే కూతురు చనిపోయింందని నమ్మించే ప్రయత్నం చేసింది. 

భార్య కళ్యాణిపై అనుమానాన్ని వ్యక్తంచేస్తూ రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోస్టుమార్టం రిపోర్ట్ లో కూడా బాలిక ఊపిరాడక చనిపోయిందని తేలింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కళ్యాణిని తమదైన శైలిలో విచారించగా కూతుర్ని చంపింది తానేనని ఒప్పుకుంది. ప్రియుడి కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు ఒప్పుకుంది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. 
 

click me!