టీఆర్ఎస్‌లో చేరుతా: కేసీఆర్‌తో భేటీ తర్వాత మండవ

By narsimha lodeFirst Published Apr 5, 2019, 4:39 PM IST
Highlights

టీడీపీని వీడీ టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ప్రకటించారు. సీఎం కేసీఆర్‌కు తాను అండగా నిలుస్తానని ఆయన ప్రకటించారు.
 

హైదరాబాద్: టీడీపీని వీడీ టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ప్రకటించారు. సీఎం కేసీఆర్‌కు తాను అండగా నిలుస్తానని ఆయన ప్రకటించారు.

శుక్రవారం నాడు మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుతో భేటీ అయ్యారు.  టీఆర్ఎస్‌లో చేరాలని మండవను కేసీఆర్ కోరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాను కేసీఆర్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా మండవ వెంకటేశ్వరరావు ప్రకటించారు. 

ఇవాళ ఉదయం పూట ఖమ్మం ఎమ్మెల్యే  పువ్వాడ అజయ్‌ కుమార్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌లు మండవ వెంకటేశ్వరరావుతో చర్చించారు.టీఆర్ఎస్‌లో చేరేందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో మండవ వెంకటేశ్వరరావు ఇంటికి కేసీఆర్ వచ్చారు. 

మండవ వెంకటేశ్వరరావు డిచ్‌పల్లి,నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ స్థానాల నుండి ఐదు దఫాలు ఎమ్మెల్యేగా  విజయం సాధించారు. చంద్రబాబునాయుడు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో మండవ వెంకటేశ్వరరావును అప్పటి పీపుల్స్‌వార్ నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. ఆ సమయంలో ఆయన భార్య నళిని కలెక్టర్ వద్ద దీక్ష చేసింది. మండవ వెంకటేశ్వరరావుకు ఎలాంటి హని తలపెట్టకుండా వదిలిపెట్టారు.

సంబంధిత వార్తలు

మండవ ఇంటికి కేసీఆర్: టీఆర్ఎస్‌లోకి ఆహ్వానం


 

click me!