Hanmakonda : పాపం... దీపావళి పండగపూట ఈ తల్లీకూతురు ఎంతపని చేసారు

Published : Nov 12, 2023, 02:25 PM ISTUpdated : Nov 12, 2023, 02:28 PM IST
Hanmakonda : పాపం... దీపావళి పండగపూట ఈ తల్లీకూతురు ఎంతపని చేసారు

సారాంశం

 దీపావళి పండగపూట హన్మకొండ జిల్లా కాజీపేటలో తల్లీకూతురు అనుమాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. 

హన్మకొండ : దీపావళి పండగపూట ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. ఏదైనా కష్టం వచ్చిందో లేక మరేదైనా జరిగిందోగానీ ఆనందోత్సాహాలతో పండగ జరుపుకోవాల్సిన వేళ తల్లీకూతురు తనువు చాలించారు. ఈ దుర్ఘటన హన్మకొండ జిల్లాలో చోటుచేసుకుంది. 

కాజీపేట దర్గా ప్రాంతానికి చెందిన కన్నెబోయిన రేణుక,  కూతురు నవ్య దీపావళి పండగపూట కనిపించకుండా పోయారు. దీంతో కంగారుపడిన  కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకగా ఓ చెరువు ఒడ్డున వీరి వస్తువులు కనిపించాయి. దీంతో స్థానికుల సాయంతో చెరువునీటిలో గాలించగా తల్లీకూతురు మృతదేహాలు లభించాయి. 

దీపావళి పండగపూట తల్లీకూతురు మృతి ఆ కుటుంబంలోనే కాదు కాజీపేటలో విషాదాన్ని నింపింది. ఎంతపని చేసావమ్మా అంటూ మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తల్లీకూతురు మృతివార్త తెలిసి చెరువువద్దకు భారీగా స్థానికులు చేరుకున్నారు. 

Read More  సోషల్ మీడియాలో ఇద్దరు బాలికలతో పరిచయం.. మార్ఫింగ్ వీడియోతో బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం..

ఆత్మహత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను నీటిలోంచి బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తల్లీకూతురు మృతికి గల కారణాలు  తెలియవని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు వీరిది ఆత్మహత్యా? లేక మరేమైనా జరిగిందా అన్నకోణంలో దర్యాప్తు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా
Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!