ఎస్సై మానవత్వం... మూడు రోజులుగా చెరువులోనే ఉన్న వృద్ధుడిని రక్షించి.. భుజాలపై మోసుకొచ్చి..

By SumaBala Bukka  |  First Published Jan 19, 2022, 8:57 AM IST

సంక్రాంతి పండుగ తర్వాత మంగళవారం అటుగా వెళ్లినా గొర్రెల కాపరులకు కొండాపురం ఊర చెరువులో అచేతనంగా పడిఉన్న వృద్ధుడు కనిపించాడు. వారు వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు. అంతే దావానలంలా ఈ వార్త village అంతా వ్యాపించింది.


రాయపర్తి : ఎన్నడూ లేనంతగా తెలుగు రాష్ట్రాలను cold వణికిస్తోంది. సాయంత్రం అయితే.. కాసేపు అలా బయటకి వెళ్లినా గడ్డ కట్టిస్తుందేమో అనేంతగా చంపేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ old man చెరువులో.. ఒంటిమీద దుస్తులు లేకుండా Unconscious stateలో... మూడు రోజులుగా పడి ఉన్నాడు. ఈ హృదయవిదారక సంఘటన warangal జిల్లా రాయపర్తి మండలం కొండాపురంలో చోటుచేసుకుంది.  

సంక్రాంతి పండుగ తర్వాత మంగళవారం అటుగా వెళ్లినా గొర్రెల కాపరులకు కొండాపురం ఊర చెరువులో అచేతనంగా పడిఉన్న వృద్ధుడు కనిపించాడు. వారు వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు. అంతే దావానలంలా ఈ వార్త village అంతా వ్యాపించింది.

Latest Videos

ఊరి సర్పంచ్  కోదాటి దయాకర్ రావు పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై బండారు రాజు వృద్ధుడిని చూసి చలించిపోయారు. గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో ఆ వృద్ధుడికి దుస్తులు తొడిగించి.. చెరువులో నుంచి మోసుకొచ్చాడు. 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. కరుకుగా కనిపించే ఖాకీ బట్టల మాటున మంచి మనసు ఉందని నిరూపించాడు.

అయితే, ఆ వృద్ధుడు గ్రామానికి చెందిన వాడు కాదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇంతకీ వృద్ధుడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఇక్కడెందుకు పడిపోయాడు? ఎవరైనా అతన్ని ఇలా పడేసి వెళ్లారా? లేక మతిస్థిమితం లేకుండా ఉన్నాడా? అన్న విషయాలు ఇంకా తెలియ రాలేదు. 

ఇలాంటి ఘటనే, నిరుడు జూన్ లో కరీంనగర్ లో జరిగింది. ప్రమాదానికి గురయి ప్రాణాపాయస్థితిలో వున్న ఓ యువకున్ని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నాడు ఓ పోలీస్ కానిస్టేబుల్. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువకుడికి రోడ్డుపైనే ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

కరీంనగర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు ఏరియాలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో రోడ్డుపైనే యువకుడు కుప్పకూలిపోయి దాదాపు ఊపిరి ఆగిపోయింది. అయితే అక్కడే విధుల్లో వున్న కానిస్టేబుల్ ఖలీల్ వెంటనే యువకుడి ఛాతిపై ఒత్తుతూ గుండె ఆగకుండా చూశాడు. ఇలా కొంతసేపు పంపింగ్ చేయడంతో యువకుడి గుండె తిరిగి కొట్టుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించారు. 

కాగా, గత మేలో నడవలేని వృద్ధురాలిమీద శాయంపేట రూరల్ సీఐ రమేష్ కుమార్ మానవత్వం చూపించారు. మే21న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంజీఎం సందర్శన సందర్బంగా ఆస్పత్రి వద్ద బందోబస్తులో ఉన్నారు రమేష్ కుమార్. ఈ సమయంలో ఓ వృద్ధురాలు అనారోగ్యంతో అవస్త పడుతూ కనిపించింది. 

ఆమె దగ్గరికి వెళ్లి అడగగా.. తాను నడవలేని స్థితిలో ఉన్నట్టు తెలిపింది. అక్కడికి దగ్గర్లో ఏ వాహనమూ లేదు. సీఎం పర్యటన  కారణంగా వచ్చే అవకాశం కూడా లేదు. దీంతో సీఐ రమేష్ కుమార్ సాహసం చేశారు. కరోనాని కూడా లెక్కచేయకుండా ఆ వృద్దురాలిని తన చేతులతో ఎత్తుకొని ఆటోలు వున్నా స్థలానికి ఎత్తుకుని తీసుకుపోయాడు.

ఓ ఆటోలో ఎక్కిచి చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి పంపించారు. ఆ సంఘటనను చూసిన పరకాల ఏసీపీ శ్రీనివాస్, మిగతా పోలీస్ సిబ్బంది సీఐ చేసిన పనికి హర్షం వ్యక్తం చేశారు. 

click me!