రైతుల‌కు గుడ్ న్యూస్.. జూన్ 26 నుంచి రైతుబంధు సాయం పంపిణీ

By Mahesh Rajamoni  |  First Published Jun 20, 2023, 3:50 PM IST

Hyderabad: తెలంగాణలో జూన్ 26 నుంచి రైతులకు రైతుబంధు ప‌థ‌క ఆర్థిక సాయం పంపిణీ చేయ‌నున్న‌ట్టు ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) నాయ‌క‌త్వంలోని బీఆర్ఎస్ ప్ర‌భ‌త్వం ప్ర‌క‌టించింది. ఈ పథకం అమలు కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో రూ.15,075 కోట్లు కేటాయించింది.
 


Rythu Bandhu Scheme: తెలంగాణ సర్కారు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 26 నుంచి రైతులకు రైతుబంధు ప‌థ‌క ఆర్థిక సాయం పంపిణీ చేయ‌నున్న‌ట్టు ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) నాయ‌క‌త్వంలోని బీఆర్ఎస్ ప్ర‌భ‌త్వం ప్ర‌క‌టించింది. ఈ పథకం అమలు కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో రూ.15,075 కోట్లు కేటాయించింది.

వివరాల్లోకెళ్తే.. ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులకు రైతుబంధు నిధుల బదలాయింపును జూన్ 26న ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రైతు బంధు పథకం అనేది తెలంగాణలో ప్రారంభించబడిన రైతు పెట్టుబడి పథకం, ఇందులో ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడిగా ప్రతి ఎకరా భూమికి రూ. 5000 ప్రోత్సాహకం ఇస్తుంది.

Latest Videos

ఈ నిర్ణయంతో రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమ అయ్యేలా చూడాలని ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు, అదనపు ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావులను కేసీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రంలో పోడు భూముల పట్టా జారీపై కేసీఆర్ మాట్లాడుతూ.. పోడు భూముల రైతులకు ఒకసారి పట్టాలు పంపిణీ చేసిన తర్వాత వారికి కూడా రైతుబంధు సాయం కోసం పరిగణిస్తామన్నారు. అలాగే భూమి పట్టాలు పొందిన రైతులకు రైతుబంధు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.

2022-23 యాసంగి సీజన్‌లో, డిసెంబర్- జనవరిలో మొత్తం 70.54 లక్షల మంది రైతులకు రైతుబంధు సహాయం అందింది. అయితే 11వ పంట సీజన్‌లో లబ్ధిదారుల జాబితా పెరగనుందని అధికారులు పేర్కొన్నారు. రైతుబంధు అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.65,559.28 కోట్లు ఖర్చు చేయగా, ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత సంవత్సరంలో రూ.15,075 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేసింది.


 

click me!