టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: తుషార్ ను అరెస్ట్ చేయవద్దన్న తెలంగాణ హైకోర్టు

By narsimha lode  |  First Published Nov 30, 2022, 2:09 PM IST

టీఆర్ఎస్  ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో  కేరళకు చెందిన  తుషార్‌కి హైకోర్లులో  ఊరట లభించింది.తుషార్ ను అరెస్ట్  చేయవద్దని  హైకోర్టు ఆదేశించింది.  అంతేకాదు  విచారణకు సహకరించాలని  కూడా  కోర్టు తుషార్ కు సూచించింది.


హైదరాబాద్: టీఆర్ఎస్  ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో  కేరళకు  చెందిన తుషార్ ను అరెస్ట్  చేయవద్దని  తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రెండు రోజుల క్రితం తుషార్  తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు  చేశారుఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన  హైకోర్టు  తుషార్ ను అరెస్ట్  చేయవద్దని  సిట్ ను ఆదేశించింది. అంతేకాదు విచారణకు  సహకరించాలని  తుషార్ కు సూచించింది హైకోర్టు.ఈ విషయమై  ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు తుషార్ ను అరెస్ట్  చేయవద్దని  సిట్  ను ఆదేశించింది. మరోవైపు విచారణకు  తుషార్  సహకరించాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అభ్యంతరాలుంటే  తమను ఆశ్రయించాలని హైకోర్టు తుషార్ కి సూచించింది.

ఎమ్మెల్యేల ప్రలోభాల  కేసులో  సిట్  విచారణపై స్టే కోరుతూ  తెలంగాణ హైకోర్టులో  తుషార్  పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు ఈ  కేసు విచారణను సీబీఐకి  బదిలీ చేయాలని  కూడా ఆయన ఆ పిటిషన్ లో  కోరారు.ఈ నెల  21న  విచారణకు రావాలని తుషార్,  బీఎల్ సంతోష్, జగ్గుస్వామిలకు సిట్ నోటీసులుజారీ చేసింది.అయితే ఈ ముగ్గురు కూడా విచారణకు రాలేదు. అయితే  తనకు ఆరోగ్యం బాగా లేనందున రెండు వారాల సమయం కోరినట్టుగా తుషార్  పేర్కొన్నారు. కానీ ఈ విషయమై తాను సిట్ కు మెయిల్  పంపానన్నారు.ఈ మెయిల్ కు స్పందించకుండానే లుకౌట్  నోటీసులు జారీ చేశారని తుషార్  ఆరోపించారు.  ఈ విషయాన్ని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.

Latest Videos

ఈ విషయమై  ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు తుషార్ ను అరెస్ట్  చేయవద్దని  సిట్  ను ఆదేశించింది. మరోవైపు విచారణకు  తుషార్  సహకరించాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.మరో వైపు హైకోర్టు సూచనతో  ఈ నెల 23న  బీజేపీ అగ్రనేత  బీఎల్ సంతోష్ కి  సిట్ నోటీసులు పంపింది. అంతకు ముందు కూడా  విచారణకు రావాలని కూడా  నోటీసులు పంపారు. కానీ సంతోష్  విచారణకు రాలేదు.ఈ నోటీసులపై బీఎల్ సంతోష్  తెలంగాణ హైకోర్టులో పిటిషన్  దాఖలు  చేశారు. ఈ  నెల 25న  బీఎల్  సంతోష్  పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సిట్  జారీ చేసిన నోటీసులపై స్టే ఇచ్చింది. డిసెంబర్  5వ తేదీ వరకు  స్టే కొనసాగుతుందని  ప్రకటించింది  కోర్టు.

also read:టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: సీబీఐ విచారణ కోరుతూ తెలంగాణ హైకోర్టులో తుషార్ పిటిషన్

ఈ  కేసులో  కేరళకు చెందిన  జగ్గుస్వామికి ఇప్పటికే  సిట్  లుకౌట్  నోటీసులు జారీ చేసింది. రామచంద్రభారతికి బీఎల్  సంతోష్ కి  తుషార్ మధ్యవర్తిగా  వ్యవహరించారని సిట్  అనుమానిస్తుంది. ఈ విషయమై ఈ ముగ్గురిని విచారించాలని భావిస్తుంది. ఈ  ఏడాది అక్టోబర్  26న నలుగురు టీఆర్ఎస్  ఎమ్మెల్యేలను  రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లు ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించారని  కేసు నమోదైంది.  అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వలబాలరాజు, కొల్లాపూర్  ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్  రెడ్డి, పినపాక ఎమ్మెల్యే  రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ఈ  ముగ్గురు నిందితులు  ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని  కేసు నమోదైంది. 
 

click me!