ఎమ్మెల్యేలకు ప్రలోభాలకేసులో ఏపీ సహా పలు రాష్ట్రాల్లో సిట్ బృందం సోదాలు చేస్తుంది. ముగ్గురు నిందితులతో సంబంధాలున్నవారిపై పోలీసులు ఆరాతీస్తున్నారు.
హైదరాబాద్:ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో పలురాష్ట్రాల్లో సిట్ బృందం సోదాలు చేస్తుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులతో సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో విచారణకు హైకోర్టు అనుమతిని ఇచ్చింది.దీంతో ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. ఆంధ్రప్రదేశ్, కేరళ,కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో సిట్ పోలీసులు సోదాలు నిర్వహించారు. కొచ్చిలోని ఓ డాక్టర్ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. రామచంద్రభారతికి డాక్టర్ మధ్య సంబంధాలపై ఆరా తీసినట్టుగా సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సింహయాజీ ఆశ్రమంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. హర్యానా,కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పోలీసులు తనిఖీలు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిని పోలీసులు రెండు రోజులపాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ విచారణ సమయంలో నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సిట్ బృందం దర్యాప్తు చేస్తుంది.
గత నెల 26న మొయినాబాద్ ఫాం హౌస్ లో రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పిర్యాదు ఆధారంగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేల ప్రలోభాల వెనుక బీజేపీ హస్తం ఉందని టీఆర్ఎస్ ఆరోపించింది. ఎమ్మెల్యేలతో నిందితులు మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో ,వీడియో లు బయటకు వచ్చాయి. వీడియోలను సీఎం కేసీఆర్ స్వయంగా మీడియా సమావేశంలో ప్రదర్శించిన విషయం తెలిసిందే.
also read:ఎమ్మెల్యేలకు బెదిరింపు ఫోన్లు:హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసుల కేసు నమోదు
ఈ కేసు విచారణనును, సిట్ దర్యాప్తును నిలిపివేయాలని బీజేపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరో వైపు ప్రలోభాలకు గురైన ఎమ్మెల్యేలకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ విషయమై ఎమ్మెల్యేలు హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.గుజరాత్, యూపీ రాష్ట్రాల నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధ,న్ రెడ్డి లు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు.