పరాయి వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య, సెల్ఫీ వీడియోలో ఆవేదన

By Siva Kodati  |  First Published Nov 13, 2022, 5:16 PM IST

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో దారుణం జరిగింది. భార్య వివాహేతర సంబంధం కారణంగా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ఆదిలాబాద్‌కు చెందిన గూడురు శేఖర్‌గా గుర్తించారు. ఇతని భార్య నాగాంజలి కారణంగా ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. 


భార్య వివాహేతర సంబంధం కారణంగా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో ఈ దారుణం జరిగింది. ఈ మేరకు సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వెళ్లబోసుకున్నాడు. ఆదిలాబాద్‌కు చెందిన గూడురు శేఖర్, నాగాంజలికి 2014లో వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె. వృత్తిరీత్యా బ్యాంక్ ఉద్యోగి అయిన నాగాంజలికి.. నాబార్డ్ ఉద్యోగితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న శేఖర్.. భార్యను నిలదీయగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. 

అయితే పెద్దలు పంచాయితీ చేసి రాజీ కుదిర్చారు. అనంతరం భార్యాభర్తలిద్దరూ ఆదిలాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. అయినప్పటికీ భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పాటు పిల్లలను తన దగ్గరకి రానివ్వకపోవడంతో శేఖర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Latest Videos

కాగా.. మరో ఘటనలో పరాయి వ్యక్తి మోజులో పడి కట్టుకున్న భర్తను అతి దారుణంగా చంపేసింది. అది కళ్లారా చూసిన కన్నకొడుకు అసలు విషయం బయటకు చెప్పడంతో... నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోచోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ALso Read:సౌభాగ్యం కోసం నోములు నోచి.. ఆ తరువాత ప్రియుడితో కలిసి భర్తను హతమర్చి... ఓ భార్య దారుణం...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో పరిధి మోహన్ లాల్ గంజ్ ప్రాంతానికి చెందిన ప్రదీప్ అనే వ్యక్తికి జ్యోతి అనే యువతితో 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కాగా....కొంత కాలం నుంచి ప్రదీప్ ఇంటికి  జ్యోతికి వరసకు తమ్ముడయ్యే రంగోలి సింగ్ అనే వ్యక్తి రావడం మొదలుపెట్టాడు. వరసకు తమ్ముడు అవుతాడనే  ఇంగితం కూడా లేకుండా... అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఈ విషయం ప్రదీప్ కి తెలియడంతో ఇద్దరినీ హెచ్చరించాడు. అయినా... వారిద్దరూ ఏ మాత్రం మారలేదు. దీంతో... భార్య తీరు మారకపోవడంతో ప్రదీప్ విసిగిపోయి... జ్యోతిని ఇంట్లో నుంచి గెంటేశాడు. అప్పటి నుంచి ఆమె ప్రియుడితో కలిసే ఉంటుంది. అయితే... ఇటీవల అర్థరాత్రిపూట ప్రియుడితో కలిసి ఇంట్లోకి వచ్చిన  ఆమె... భర్తపై దాడి చేసి హత్య చేసింది.  అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది.ఇందతా ఆమె ముగ్గురు బిడ్డల్లో ఒకరు చూడటం గమనార్హం. ఆ బాలుడు వెళ్లి.. పక్కింటివారికి జరిగినదంతా చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి నిందతులను అరెస్టు చేశారు.

click me!