మొయినాబాద్ ఫాం హౌస్ లో ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ఏపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజుకి సిట్ ఇవాళ నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్:మొయినాబాద్ ఫాంహౌస్ లో ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ఏపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సిట్ అధికారులు గురువారంనాడు నోటీసులు జారీ చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులతో ఎంపీ రఘురామకృష్ణంరాజుకి 41 ఏ సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీ చేసింది సిట్. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో అరెస్టైన నిందితులతో పరిచయాలున్నాయనే రఘురామకృష్ణంరాజుకి సిట్ నోటీసులు జారీ చేసిందని సమాచారం. ఈ కేసును సిట్ విచారిస్తుంది.
also read:ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: బీజేపీ నేత బీఎల్ సంతోష్ కి మరో సారి సిట్ నోటీసులు
undefined
గత నెల 26న మొయినాబాద్ ఫాం హౌస్ లో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి , పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యేల పైలెట్ రోహిత్ రెడ్డిలను పార్టీ మారాలని ప్రలోభపెట్టారని ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేల ప్రలోభాల వెనుక బీజేపీ ఉందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కానీ ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది.ఈ కేసును విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ ఇప్పటికే పలువురిని విచారించింది. బీఎల్ సంతోష్ , తుషార్, జగ్గుస్వామిలకు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. మొయినాబాద్ ఫాం కేసు తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లో కలకలం రేపింది. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఈ కేసు మాటల యుద్ధానికి కారణమైంది. రెండు పార్టీల నేతలు తమ వాదనలను సమర్ధించుకుంటున్నారు.
ఈ ఏడాది అక్టోబర్ 26న మొయినాబాద్ ఫాం హౌస్ లో నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నారనే ఆరోపణలతో రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లు అరెస్టయ్యారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు , కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి , పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ముగ్గురు నిందితులు ప్రలోభాలకు గురి చేశారని కేసు నమోదైంది.
పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురు నిందితులను మొయినాబాద్ పోలీసులు గత నెల 26వ తేదీన అరెస్ట్ చేశారు. నిందితులు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ కేసుతో సంబంధాలున్నాయనే అనుమానంతో సిట్ పలువురికి నోటీసులు జారీ చేసింది. అంతేకాదు కొందరిని విచారించింది. మరికొందరికి కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో బీఎల్ సంతోష్ , తుషార్ లకు కూడా సిట్ ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో ఏపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కు కూడా సిట్ ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో కేరళకు చెందిన జగ్గుస్వామికి సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.