బీజేపీ కుట్రలకు భయడపడం, కేసీఆరే మా ధైర్యం: మంత్రి మల్లారెడ్డి

By narsimha lode  |  First Published Nov 24, 2022, 11:04 AM IST

తనపై బీజేపీ కుట్ర పన్నిందని  తెలంగాణ మంత్రి మల్లారెడ్డి  చెప్పారు.  తన నివాసంలో  రూ. 6 లక్షలు  దొరికాయన్నారు.  తన  నివాసంలో  ఐటీ  దాడులు  జరగడం  మూడోసారి  అని మల్లారెడ్డి  చెప్పారు. 


హైదరాబాద్:తనపై  బీజేపీ  కుట్ర  పన్నిందని  మంత్రి మల్లారెడ్డి  ఆరోపించారు. ఇందులో భాగంగానే  ఐటీ  దాడులు  చోటు  చేసుకున్నాయన్నారు.ఇలాంటి  దాడులు  జరుగుతాయని తమకు  కేసీఆర్  చెప్పారని ఆయన గుర్తు  చేశారు. గురువారంనాడు హైద్రాబాద్‌లోని  తన  నివాసంలో  మంత్రి మల్లారెడ్డి  మీడియాతో మాట్లాడారు.తన  నివాసంలో  రూ. 6 లక్షలు  దొరికితే  వాటిని  ఐటీ  అధికారులు వదిలి వెళ్లిపోయారని  తెలంగాణ మంత్రి  మల్లారెడ్డి  చెప్పారు. వందల  కోట్లు  దొరుకుతాయని  ఐటీ  అధికారులు  ఆశతో  వచ్చి  నిరాశతో వెళ్లారన్నారు.  సోమవారం నుండి  విచారణ పేరుతో  ఐటీ  కార్యాలయం చుట్టూ  తిరగాల్సి  వస్తుందన్నారు.   తన  విద్యాసంస్థల్లో  ఎంతో మంది  పేద విద్యార్ధులకు  చదువు  అందిస్తున్నట్టుగా  మంత్రి  తెలిపారు.

బీజేపీ కుట్రలకు  భయపడేది  లేదన్నారు. కేంద్ర  బలగాలతో తమపై  పెద్దఎత్తున  దాడులు  చేశారని  మంత్రి  ఆరోపించారు. తనతో పాటు  కేసీఆర్ ను  కూడా  ఏమీ  చేయలేరని  మంత్రి మల్లారెడ్డి  చెప్పారు.ఐటీ, ఈడీ  దాడులు  జరుగుతాయని  కేసీఆర్  ముందే  చెప్పారని  మంత్రి మల్లారెడ్డి  తెలిపారు.  కుట్రలతో  బీజేపీ  దాడులు  చేయిస్తుందన్నారు.  బీజేపీ పాలిత  రాష్ట్రాల్లో  ఐటీ, ఈడీ  దాడులు  ఎందుకు  జరగడం  లేదని ఆయన  ప్రశ్నించారు. తెలంగాణ  రాష్ట్రంలో  చేపట్టిన  అభివృద్ది, సంక్షేమ  కార్యక్రమాల  కోసం  ఆయా రాష్ట్రాల్లో ప్రజలు  పెద్ద  ఎత్తున  డిమాండ్  చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ను  కేసీఆర్ ఏర్పాటు  చేయడంతో  ఉద్దేశ్యపూర్వకంగా  తమ  పార్టీపై దాడులు  చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి  చెప్పారు.

Latest Videos

undefined

also read:ఐటీ అధికార్లు ఫోన్లు చేయలేదు: టర్కీ నుండి తిరిగి వచ్చిన మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి

విద్యాసంస్థలు  ఏర్పాటు  చేసి  ప్రపంచస్థాయిలో  గర్వపడేలా  ఇంజనీర్లను,డాక్టర్లను తమ  విద్యా సంస్థ  తయారు  చేస్తుందని  మంత్రి  తెలిపారు.మెడికల్  కాలేజీల్లో  ఆడ్మిషన్ల  సమయంలో  మేనేజ్ మెంట్  కోటా  లక్షల  రూపాయాలు  వసూలు  చేసినట్టుగా  జరుగుతున్న  ప్రచారంలో  వాస్తవం  లేదన్నారు.  ఏ,బీ,సీ  కేటగిరి  కింద  మెడికల్  సీట్లను  కేటాయిస్తున్నట్టుగా  మంత్రి  తెలిపారు. ప్రభుత్వమే   కౌన్సిలింగ్ లో  సీట్లను  కేటాయిస్తుందని  మంత్రి  వివరించారు.తమ  కాలేజీల్లో  రూ. 35  వేలకు  ఏంబీఏ  సీటు  అందిస్తున్నామన్నారు. తాను  అక్రమాలు  చేయనన్నారు.  అంతా  ఓపెన్  గా నే  ఆడ్మిషన్లంటాయని  మంత్రి మల్లారెడ్డి  చెప్పారు.

తనపై  ఐటీ  దాడులు  చేయడం  మూడోసారి  మంత్రి మల్లారెడ్డి  చెప్పారు. కానీ ఈ దఫా  మాత్రం  ఐటీ  అధికారులు  వ్యవహరించిన  తీరును  ఆయన  తప్పుబట్టారు. తమ  కుటుంబ  సభ్యులను  ఐటీ  అధికారులు  భయబ్రాంతులకు  గురి చేశారన్నారు. తమ  విద్యాసంస్థల్లో  పనిచేసే  సిబ్బందిని  కూడా  ఐటీ  అధికారులు  బెదిరించారని  మంత్రి  మల్లారెడ్డి  ఆరోపించారు.మెడికల్  సీట్ల  కేటాయింపులో  డొనేష్లన్లు తీసుకోలేదని తెలంగాణ  మంత్రి  మల్లారెడ్డి  చెప్పారు.  

ఆసుపత్రిలో  చికిత్స  పొందుతున్న  తన  పెద్ద  కొడుకు నుండి  బలవంతంగా  సంతకాలు  తీసుకున్నారన్నారు.ఈ  విషయం  తెలిసి  తాను  ఆసుపత్రికి వెళ్లినట్టుగా  మంత్రి  తెలిపారు.ఐటీ  అధికారులు  తయారు  చేసినా  స్టేట్ మెంట్  చదవకుండానే  తన  పెద్ద కొడుకు సంతకం  పెట్టారన్నారు. దౌర్జన్యంగా  తన  పెద్ద కొడుకుతో  సంతకం పెట్టించారన్నారు.తన  కొడుకుతో  తీసుకున్న  సంతకం ఉన్న స్టేట్ మెంట్  కాపీని  బోయినపల్లిక  తరలించినట్టుగా  ఐటీ  అధికారి చెప్పడంతో  అతడిని  తీసుకొని  బోయినపల్లి పోలీసులకు  అప్పగించానన్నారు. రూ. 100  కోట్లు  డొనేషన్లు తీసుకున్నట్టుగా  ఐటీ  స్టేట్ మెంట్ లో  ఉందని  ఐటీ  అధికారి  తెలిపారన్నారు. అక్రమంగా  డబ్బులు  తీసుకోకుండా  ఆ డబ్బును  ఎక్కడి నుండి  తీసుకురావాలని  మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. 
 

click me!