
తెలంగాణ సిఎం కేసిఆర్ ప్రవేశ పెట్టే పథకాల గుట్టు విప్పి చెప్పారు శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ. ఏదైనా పథకం అనుకుంటే ఆగమేఘాల మీద ప్రారంభించడం, తర్వాత దాన్ని మూలకు పడేయడం ఇదే కేసిఆర్ నైజం అని అన్నారు షబ్బీర్ అలీ. ఈ మూడేళ్ల కాలంలో ప్రతి పథకం అలాగే మొదలై అలాగే మూలన పడ్డదని ఎద్దేవా చేశారు.
భూసర్వే పై టీఆరెస్ ప్రజా ప్రతినిధుల తో మాత్రమే. మాట్లాడటం సరికాదన్నారు. భూ సర్వే పై ఆల్ పార్టీ సమావేశం పెట్టాలన్నారు. మీ పార్టీ ఎమ్మెల్యే మంత్రి లు ఉంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ చెబుతున్న సర్వేలపై టిఆర్ఎస్ నేతలకే నమ్మకం లేదన్నారు. గతంలో సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. .తక్షణమే రిపోర్ట్ ను ప్రజల ముందుంచాలన్నారు. ప్రత్యేకంగా అసెంబ్లీ ని సమావేశ పర్చి భూసర్వే పై చర్చించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఇప్పుడు ఉన్నది డూప్లికేట్ టీఆరెస్ ది పాలన అని విమర్శించారు. కేసీఆర్ కు గెలుస్తామన్న దమ్ముంటే.. మీ పార్టీలోకి వచ్చిన ఇతర పార్టీ ఎమ్మెల్యే లతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. వంద గెలుస్తావో.. ఒకటి గెలుస్తావో అప్పుడు తెలుస్తుందన్నారు. టీఆరెస్ నుండి జంప్ జిలానీలు ఉన్నారన్న వార్తలతోనే.. కేసీఆర్ అందరికి టికెట్లు అంటున్నారని ఎద్దేవా చేశారు.
స్వంత పార్టీ ఎమ్మెల్యే. లు గోడ దుకుతారనే కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో 90శాతం మంది సిట్టింగ్ లకు కేసీఆర్ టికెట్లు ఇవ్వరు అని స్పష్టం చేశారు షబ్బీర్ అలీ.