Telangana: రైతు వ్యతిరేక ప్రభుత్వం.. కేంద్ర బీజేపీ సర్కారుపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు

Published : Apr 13, 2022, 04:56 PM IST
Telangana: రైతు వ్యతిరేక ప్రభుత్వం.. కేంద్ర బీజేపీ సర్కారుపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు

సారాంశం

Telangana: ప్ర‌ధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ స‌ర్కారు రైతుల‌ను ప‌ట్టించుకోక‌పోయిన‌ప్ప‌టికీ.. సీఎం కేసీఆర్ మాత్రం రైతుల‌కు అండ‌గా నిలిచార‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత అన్నారు. కేంద్ర బీజేపీ స‌ర్కారు రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వ‌మ‌ని ఆరోపించారు.   

Telangana: టీఆర్ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత మ‌రోసారి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నాయ‌క‌త్వంలోని కేంద్ర బీజేపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుపడ్డారు.కేంద్రం రైతులను వదిలిపెట్టినా.. కేసీఆర్ రైతులకు అండగా నిలిచార‌ని పేర్కొన్నారు. కేంద్ర బీజేపీ స‌ర్కారు రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వ‌మ‌ని ఆరోపించారు. కేంద్ర బీజేపీ ప్ర‌భుత్వం రైతుల‌ను వ‌దిలించుకోవాల‌ని చూస్తున్న‌దనీ, అయితే, ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రైతులకు అండగా ఉంటారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్ప‌ష్టం చేశారు.  

భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) కేంద్ర ప్ర‌భుత్వంపై త‌న విమ‌ర్శ‌ల దాడిని కొన‌సాగిస్తూ.. ఇది కార్పొరేట్ స్నేహపూర్వక.. రైతు వ్యతిరేకం స‌ర్కారు అంటూ ఆరోపించారు. "వారు మా అభ్యర్థనలను పట్టించుకోలేదు. కాబట్టి రాష్ట్ర బడ్జెట్‌లోనే రైతుల నుంచి వరిధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. రైతు మిత్రుడు కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఇది. ఇది మాత్రమే కాదు, మన రైతు విధానాలన్నీ చాలా ప్రత్యేకమైనవి మరియు మన రాష్ట్రంలో మాత్రమే తీసుకోబడ్డాయి.. దేశంలో ఎక్క‌డాలేని విధంగా రైతు సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నాం” అని క‌విత అన్నారు.

తెలంగాణను భారతదేశపు ధాన్యాగారంగా అభివ‌ర్ణించిన ఆమె.. “నేడు, భారతదేశపు బియ్యం/వరిలో 40 శాతం తెలంగాణ నుంచే ఉత్పత్తి అవుతోంది. ఉత్పత్తి ఇంత ఎక్కువ పరిమాణంలో ఉన్నందున వ‌రిసేక‌ర‌ణ గురించి మేము కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల‌కు అండ‌గా నిలవాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని” తెలిపారు. వచ్చే యాసంగి (రబీ) సీజన్‌లో రైతులు పండించిన మొత్తం వరి పంటను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని కేంద్రం, రాష్ట్ర ప‌ర‌భుత్వం మ‌ధ్య గ‌త కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలు వార్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. టీఆర్ఎస్‌-బీజేపీల మ‌ధ్య తీవ్రమైన రాజకీయ పోరుకు దారితీసిన ఈ అంశం. ఇదే విష‌యంపై మంగళవారం నాడు తెలంగాణ‌ క్యాబినెట్ సమావేశంలో జరిగిన చర్చల తర్వాత.. కేసీఆర్ స‌ర్కారు ఈ నిర్ణ‌యం తీసుకుంది. 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్