కేసీఆర్ అరెస్ట్ కావడం ఖాయం: గవర్నర్ తమిళిసైతో భేటీ తర్వాత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

Published : Apr 13, 2022, 04:31 PM IST
కేసీఆర్ అరెస్ట్ కావడం ఖాయం: గవర్నర్ తమిళిసైతో భేటీ తర్వాత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

తెలంగాణ‌ గవర్నర్‌ తమిళిసై సౌంద‌‌ర్‌రాజ‌న్‌తో ప్రజాశాంతి పార్టీ అధ్య‌క్షుడు, క్రైస్తవమత ప్రబోధకుడు కేఏ పాల్ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మట్టాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ‌ గవర్నర్‌ తమిళిసై సౌంద‌‌ర్‌రాజ‌న్‌తో ప్రజాశాంతి పార్టీ అధ్య‌క్షుడు, క్రైస్తవమత ప్రబోధకుడు కేఏ పాల్ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మట్టాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఇంత అవినీతి ఎప్పుడూ చూడలేదన్నారు. రేపో మాపో కేసిఆర్ అరెస్ట్ కావడం ఖాయమని అన్నారు. అందుకే తమిళి సై మీద కేటీఆర్‌తో మాట్లాడిస్తున్నారని అన్నారు. ఎనిమిదేళ్లలో.. మొత్తం 8 లక్షల కోట్ల సొమ్ము ఏమైందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వీటిని డైవర్ట్ చేయడానికే ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. రైతు సంఘాల నేత రాకేష్ టికాయత్ తన శిష్యుడే అని పాల్ చెప్పారు. ఆయనను అడ్డం పెట్టుకుని కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 

కేసీఆర్‌కు కళ్లు నెత్తికి ఎక్కాయని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి పాలన, కుల పాలనను అంతం చేయడానికే తాను అమెరికా నుంచి వచ్చానని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం తానేనన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున తిరుగుతానని చెప్పారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌లలో టీఆర్ఎస్‌కు 30 సీట్లు కూడా రావని ప్రశాంత్ కిశోర్ చెప్పారని అన్నారు. 

ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జార్జ్ బుష్, బిల్ క్లింటన్‌ను హైదరాబాద్‌కు తానే తీసుకు వచ్చాన‌ని తెలిపారు. సీఆర్ విజయనగరం నుంచి తెలంగాణకు వలస వచ్చారని అన్నారు. తాను వైజాగ్ నుంచి వచ్చినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లింద‌ని.. అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కేఏ పాల్ అన్నారు. మ‌రో ఇరవై ఏళ్లు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అప్పు తీరదని చెప్పారు. ఇక, తెలంగాణ ప్రజలు మీతో ఉన్నారని గవర్నర్‌ తమిళిసైతో చెప్పానని కేఏ పాల్ తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్