గచ్చిబౌలి కారు ప్రమాదంలో ట్విస్ట్: ప్రియాంక మృతి, మద్యం మత్తులో మిత్తీ మోడీ

By narsimha lodeFirst Published Nov 9, 2020, 5:28 PM IST
Highlights

హైద్రాబాద్ గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్విస్ట్ చోటు చేసుకొంది. మిత్తి మోడీ అనే వ్యక్తి మద్యం మత్తులో అతి వేగంగా కారును నడపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన మోడీని హైద్రాబాద్ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు.


హైదరాబాద్: హైద్రాబాద్ గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్విస్ట్ చోటు చేసుకొంది. మిత్తి మోడీ అనే వ్యక్తి మద్యం మత్తులో అతి వేగంగా కారును నడపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన మోడీని హైద్రాబాద్ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు.

ఆదివారం నాడు అర్ధరాత్రి పబ్ లో పుల్ గా మద్యం తాగి అతి వేగంగా కారును డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు ప్రకటించారు.

స్నేహితుల ఇంటికి వెళ్లి వస్తానని వెళ్లిన ప్రియాంక ఈ ప్రమాదంలో మరణించింది. కారులో రెండు ఎయిర్ బ్యాగులు తెరుచుకొన్నప్పటికీ ప్రియాంక బతకలేదు.  ప్రియాంక సీటు బెల్ట్ పెట్టుకోని కారణంగానే ఆమెకు తీవ్రంగా గాయాలై మరణించిందని పోలీసులు తెలిపారు.

జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ నుండి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలికి వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.బ్రీత్ ఎనలైజర్ టెస్టులో 45 శాతం మద్యం ఆనవాళ్లు లభించినట్టుగా పోలీసులు తెలిపారు. మిత్తి మోడీపై పోలీసులు 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

విశాఖపట్టణానికి చెందిన మోడీ హైద్రాబాద్ కు ఎందుకు వచ్చాడనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రష్యాలో విద్యనభ్యసిస్తున్న ప్రియాంక లాక్ డౌన్ కారణంగా హైద్రాబాద్ కు వచ్చింది.

ప్రియాంక తల్లి కూడ మోడీ మద్యం తాగి కారును డ్రైవ్ చేస్తున్నట్టుగా ఫిర్యాదు చేసింది. విశాఖకు చెందిన ప్రముఖ వ్యాపారి కొడుకు మోడీగా పోలీసులు గుర్తించారు.

click me!