హైద్రాబాద్ బేగంపేటలో భారీ శబ్దం చేస్తూ ఎంఎంటీఎస్ రైలు నిలిచిపోయింది. దీంతో ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు.
హైద్రాబాద్ బేగంపేటలో భారీ శబ్దం చేస్తూ ఎంఎంటీఎస్ రైలు నిలిచిపోయింది. దీంతో ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు. సాంకేతిక కారణాలతోనే ఎంఎంటీఎస్ రైలు నిలిచిపోయినట్టుగా సమాచారం. అయితే ఈ విషయాన్ని సకాలంలో ఎంఎంటీఎస్ సిబ్బంది గుర్తించారు.
హైద్రాబాద్ లో ట్రాఫిక్ సమస్య నేపథ్యంలో ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలంటే హైద్రాబాద్ మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ ను (ఎంఎంటీఎస్)ను 2003లో ప్రారంభించారు. అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి ఎల్ కే అద్వానీ ఎంఎంటీఎస్ ను 2003 ఆగస్టు 9వ తేదీన ప్రారంభించారు. హైద్రాబాద్ లో మూడు ప్రధాన సుదూర రైలు టెర్మినల్ ను ఎంఎంటీఎస్ తో అనుసంధానం చేశారు. అతి తక్కువ ఖర్చుతో సుదూర ప్రయానం చేసేందుకుగాను ఎంఎంటీఎస్ రైలును అందుబాటులోకి తీసుకు వచ్చారు.