సీల్డ్‌కవర్లో వివరణ: కోమటిరెడ్డి భవితవ్యంపై ఉత్కంఠ

By narsimha lodeFirst Published Sep 24, 2018, 5:13 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘానికి  తన వివరణను అందించారు. 

హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘానికి  తన వివరణను అందించారు.  సీల్డ్ కవర్లో తన వివరణను పీఏ ద్వారా సోమవారం నాడు గాంధీభవన్‌కు పంపారు.

రెండు రోజుల క్రితం గాంధీభవన్‌‌పై, కొందరు   కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలను  కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకొంది.

రెండు రోజుల క్రితం కోదండరెడ్డి నేతృత్వంలో సమావేశమైన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం  ఎమ్మెల్సీ కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన రోజు సాయంత్రం కూడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

అదే రోజు సాయంత్రం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ మరోసారి కాంగ్రెస్ పార్టీ నేతలపై  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.అయితే పార్టీ క్రమశిక్షణ సంఘం రెండు రోజుల్లోపుగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ  క్రమశిక్షణ సంఘానికి  సోమవారం నాడు తన వివరణను సీల్డ్ కవర్లో పంపారు.

పార్టీ కార్యకర్తల ఆవేదనను వివరించినట్టుగా ఆ లేఖలో ఉన్నట్టు సమాచారం. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  వివరణపై  క్రమశిక్షణ సంఘం కోదండరెడ్డి నేతృత్వంలో సమావేశమై చర్చిస్తోంది.

సంబంధిత వార్తలు

కాంగ్రెసుపై బ్రదర్ ఫైర్: కీలక భేటీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజర్

కేసీఆర్ ను తిడితేనే పదవులిస్తారా: రేవంత్ కు కోమటిరెడ్డి సెటైర్

వీహెచ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కుంతియా స్పందన ఇదీ

కోమటిరెడ్డికి షాక్: షోకాజ్ నోటీసులిచ్చిన కాంగ్రెస్

గాంధీభవన్ లో డబ్బులకు పదవులు అమ్ముకుంటున్నారు: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అసమ్మతిపై అధిష్టానం ఆగ్రహం: కోమటిరెడ్డికి నోటీసులు?

ఇక్కడ కేసీఆర్‌కు, అక్కడ జగన్‌కు కోవర్టులు: వీహెచ్ సంచలనం

టీపీసీసీ కొత్త కమిటీల ఎఫెక్ట్: ట్విస్టిచ్చిన సుధీర్ రెడ్డి

టీపీసీసీ కొత్త కమిటీ ఎఫెక్ట్: కాంగ్రెస్‌లో కేసీఆర్ కోవర్టులు: వీహెచ్

రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌లో నిరసన సెగ

కాంగ్రెస్ తీరు: కారెక్కిన సురేష్‌రెడ్డికి మూడు కమిటీల్లో చోటు

ఎన్నికల కమిటీలు: కాంగ్రెస్‌లో ఇక రేవంత్ జోరు

 

click me!