యువకుడిని చితకబాదిన రాజోలి ఎస్ఐ: సోషల్ మీడియాలో వీడియో వైరల్

Published : Sep 27, 2021, 04:41 PM IST
యువకుడిని  చితకబాదిన రాజోలి ఎస్ఐ: సోషల్ మీడియాలో  వీడియో వైరల్

సారాంశం

జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి ఎస్ఐ తీరు వివాదాస్పదంగా మారింది. లక్ష్మణ్ అనే యువకుడిని ఎస్ఐ లెనిన్, మరో కానిస్టేబుల్ చితకబాదాడు.ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలోని (Gadwal district) రాజోలి ఎస్ఐ (Rajoli SI) ఓ యువకుడిని  చితకబాదాడు. ఈ ఘటనకు సంబంధించిన దశ్యాలు సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారాయి. జోగులాం గద్వాల జిల్లాకు చెందిన లక్ష్మణ్ (Laxman) అనే యువకుడిని రాజోలి ఎస్ఐ లెనిన్ (lenin), మరో కానిస్టేబుల్ చితకబాదారు. పోలీసు వాహనానికి  లక్ష్మణ్ తలను బాదాడు. 

లక్ష్మణ్ ను కొట్టొద్దని స్థానికులు ఎస్ఐను కోరుతున్న దృశ్యాలు మాటలు కూడ ఆ వీడియోలో విన్పించాయి. మద్యం మత్తులో పోలీస్ వాహనంపై దాడికి ప్రయత్నించడంతో కొట్టినట్టుగా పోలీసులు చిత్రీకరిస్తున్నారని బాధితుడు లక్ష్మణ్ ఆరోపిస్తున్నాడు.

కర్రతో బాదడమే కాకుండా కాలితో లక్ష్మణ్ ను రాజోలి ఎస్ఐ లెనిన్ తన్నాడు. దీంతో లక్ష్మణ్ కుప్పకూలిపోయాడు. అదే సమయంలో అక్కడే ఉన్న మరో కానిస్టేబుల్  కూడ లక్ష్మణ్ ను కొట్టాడు. ఈ దృశ్యాలను కొందరు స్థానికులు ఫోన్ లో రకార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు.గతంలో కూడ ఇదే జిల్లాకు చెందిన సీఐ తీరుపై ఆరోపణలు రావడంతో  ఆయనను విధుల నుండి తప్పించారు. ఈ  ఘటన మరువకముందే ఈ ఘటన చోటు చేసుకొంది.


 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?