గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్: హైద్రాబాద్‌లో కుండపోత,లోతట్టు ప్రాంతాలు జలమయం

By narsimha lode  |  First Published Sep 27, 2021, 5:47 PM IST

గులాబ్ తుఫాన్ ప్రభావంతో హైద్రాబాద్ నగరంలో  భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ప్రధాన రహదారుల్లో వరద నీరు పోటెత్తింది.దీంతో వావాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.


హైదరాబాద్: గులాబ్ తుఫాన్ (cyclone gulab) ప్రభావంతో హైద్రాబాద్ (hyderabad)నగరంలో సోమవారం నాడు  ఉదయం నుండి కుండపోత వర్షం కురుస్తోంది. ఉదయం నుండి సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉంది. తెలంగాణకు మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో  ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. అవసరమైతేనే ఇళ్ల నుండి బయటకు రావాలని హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ సూచించారు.

  ఇవాళ ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నగరంలోని ప్రధాన రోడ్లలో కూడ వరద పోటెత్తెంది.  వాహనాలు నీళ్లలోనే ముందుకు సాగుతున్నాయి. ద్విచక్రవాహనదారులు  రోడ్లపై పెద్ద ఎత్తున నీళ్లతో ఇబ్బందులు పడుతున్నారు.పాతబస్తీలోని ప్రధాన రోడ్లపై నడుము లోతు నీళ్లు చేరుకొన్నాయి. దీంతో తమ గమ్యస్థానాలు చేరుకొనేందుకు ప్రయాణీకులు బస్సు టాప్ నిలబడి ప్రయాణం చేస్తున్నారు.

Latest Videos

undefined

కూకట్‌పల్లి, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, తుర్క యంజాల్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, బోరబండ, నాగోల్, ఎల్బీనగర్, ప్రగతి నగర్, సుల్తాన్ బజార్, కోఠి, మన్సూరాబాద్, అల్లాపూర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, రహమత్ నగర్, జూబ్లీహిల్స్, సైదాబాద్, రామాంతాపూర్, అంబర్ పేట, మలక్ పేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరో రెండు గంటలకు పైగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. హైద్రాబాద్ కలెక్టరేట్ లో కూడ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు అధికారులు. కంట్రోల్ రూమ్ నెంబర్.. 040-23202813.వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో  ప్రజలంతా అప్రమత్తంగా హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ కోరారు. ఏదైనా సమస్య ఉంటే 100 కు ఫోన్ చేయాలన్నారు.


 

click me!