లండన్ లో మెగా బతుకమ్మ వేడుకలు.. పోస్టర్ ఆవిష్కరించిన కవిత..

By AN TeluguFirst Published Sep 28, 2021, 11:53 AM IST
Highlights

తెలంగాణ జాగృతి యూకే విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 10 వ తేదీన లండన్ లో మెగా బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. బతుకమ్మ వేడుకల్లో యూకే తెలంగాణ  జాగృతి ప్రతినిధులు, ప్రవాస తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. 

తెలంగాణ జాగృతి(Telangana Jagriti) లండన్ విభాగం ఆధ్వర్యంలో జరిగే మెగా బతుకమ్మ వేడుకల(Mega Batukamma celebrations) పోస్టర్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha)ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను దేశ విదేశాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్న  తెలంగాణ జాగృతి నాయకులను ఎమ్మెల్సీ కవిత అభినందించారు.  

తెలంగాణ జాగృతి యూకే విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 10 వ తేదీన లండన్ లో మెగా బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. బతుకమ్మ వేడుకల్లో యూకే తెలంగాణ  జాగృతి ప్రతినిధులు, ప్రవాస తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. 

అక్టోబర్ 10వ తేదీన బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే ఆడబిడ్డలకు తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా చేనేత చీరలను అందించనున్నామని తెలంగాణ జాగృతి యూకే విభాగం అధ్యక్షులు సుమన్ బల్మూరి పేర్కొన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ  జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్,  స్టేట్ జనరల్ సెక్రెటరీ నవీన్ ఆచారి, స్టేట్ సెక్రెటరీ రోహిత్ రావు, తెలంగాణ జాగృతి నాయకులు ప్రశాంత్ పూస, నితిష్, రోహిత్ రావ్, దినేష్ రెడ్డి, అనుషా దుర్గా, జితూ, రోహిత్ రెడ్డి పాల్గొన్నారు.

Cyclone Gulab: మరో రెండు రోజులు భారీ వర్షాలు... అప్రమత్తంగా వుండండి: మంత్రి గంగుల ఆదేశాలు

ఇదిలా ఉండగా,  నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసనమండలిలో సోమవారం చేసిన తొలి ప్రసంగం రాజకీయ వర్గాల్లో అలజడి సృష్టించింది. చర్చనీయాంశంగా మారింది. ఆమె తన ప్రసంగంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీల దయనీయ పరిస్థితిని వివరించారు, వారికి న్యాయం జరిగేలా చూడాలని పంచాయతీ రాజ్ శాఖా మంత్రిని కోరారు. 

ఎంపిటిసిలు, జెడ్‌పిటిసిలకు నిధుల కొరత, వారికి సరైన గౌరవం లేకపోవడం కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను కవిత మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎన్నుకోబడిన మండల పరిషత్ అధ్యక్షులకు శాశ్వత కార్యాలయాలు కూడా లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీలలో సర్పంచ్‌లతో పాటు ఎన్నికైన ఎంపీటీసీలు కూర్చొని, విధులు నిర్వర్తించడానికి సరైన స్థలం లేదని, దీనివల్ల వారు అవమానానికి గురవుతున్నారని అన్నారు. 

ప్రసంగంలో భాగంగా ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. పంచాయితీ రాజ్ మంత్రిని అడ్రస్ చేశారు. పంచాయతీ రాజ్ మంత్రి MPTCల పట్ల గౌరవంగా వ్యవహరించాలని, వారి విధులను నిర్వర్తించడానికి వీలుగా కనీసం కుర్చీలను అందించాలని ఆమె కోరారు. ఎంపీటీసీలు, జెడ్‌పిటిసిలు గ్రామ పంచాయతీలలో అధికారిక కార్యక్రమాల సమయంలో, స్వాతంత్ర్య దినోత్సవం లేదా గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగురవేసేలా అవకాశం ఇవ్వాలని కూడా ఆమె కోరారు.

click me!