బీఆర్ఎస్‌కు షాక్: రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి

By narsimha lode  |  First Published Oct 1, 2023, 11:33 AM IST

బీఆర్ఎస్‌కు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఇవాళ రాజీనామా చేశారు.నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ వైఎస్ చైర్మెన్ బాలాజీ సింగ్ కూడ రాజీనామా చేశారు. 
 


హైదరాబాద్: బీఆర్ఎస్ కు ఆ పార్టీ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి  ఆదివారం నాడు రాజీనామా చేశారు.  నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ వైఎస్ చైర్మెన్ బాలాజీసింగ్  కూడ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇవాళ ఉదయమే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ టిక్కెట్టును ఆశించారు కసిరెడ్డి నారాయణ రెడ్డి. అయితే సిట్టింగ్  ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కే కేసీఆర్ టిక్కెట్టును కేటాయించారు.దీంతో కసిరెడ్డి నారాయణ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు.  

గత కొంతకాలం నుండి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి  కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుండి పోటీకి రంగం సిద్దం చేసుకుంటున్నారు. రెండు మూడు దఫాలు అనుచరులతో సమావేశమయ్యారు.గత మాసంలో  బీఆర్ఎస్ టిక్కెట్లను  కేసీఆర్ ప్రకటించారు.  అయితే  కల్వకుర్తి టిక్కెట్టు దక్కకపోవడంతో  కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలోనే  ఆయన గత వారంలో ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.  రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాత  కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.  తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపారు కసిరెడ్డి నారాయణ రెడ్డి. కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుండి కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు.బీఆర్ఎస్ లో చేరడానికి ముందు కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న విషయం తెలిసిందే.

Latest Videos

undefined

కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుండి ఆయన గతంలో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా  పోటీ చేసి గణనీయమైన ఓట్లను సాధించారు.  2018 ఎన్నికల్లో కూడ కల్వకుర్తి నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీకి ప్రయత్నించారు. అయితే  ఆ సమయంలో కేటీఆర్ కసిరెడ్డి నారాయణరెడ్డిని ఒప్పించారు. దీంతో  కసిరెడ్డి నారాయణ రెడ్డి  పోటీ చేయలేదు. దీంతో కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఎమ్మెల్సీని మరోసారి పొడిగించింది బీఆర్ఎస్ నాయకత్వం. అయితే  బీఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గాల మధ్య నియోజకవర్గంలో గతంలో ఘర్షణలు కూడ జరిగాయి. 

also read:బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ... రేవంత్ రెడ్డితో సిట్టింగ్ ఎమ్మెల్సీ కసిరెడ్డి భేటీ

కసిరెడ్డి నారాయణ రెడ్డితో పాటు జిల్లా పరిషత్ వైఎస్ చైర్మెన్ బాలాజీ సింగ్  కాంగ్రెస్ లో చేరనున్నారు.ఇదే విషయమై  రేవంత్ రెడ్డితో  కసిరెడ్డి నారాయణ రెడ్డి చర్చించారనే ప్రచారం సాగుతుంది. అయితే మర్యాదపూర్వకంగానే  రేవంత్ రెడ్డితో భేటీ అయినట్టుగా  కసిరెడ్డి నారాయణ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు.

click me!