TSRTC : చిల్లర సమస్యకు చెక్.. ఇకపై సిటీ బ‌స్సుల్లో యూపీఐ సేవ‌లు

Published : Oct 01, 2023, 11:15 AM ISTUpdated : Oct 01, 2023, 01:55 PM IST
TSRTC : చిల్లర సమస్యకు చెక్.. ఇకపై సిటీ బ‌స్సుల్లో యూపీఐ సేవ‌లు

సారాంశం

TSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. బస్సుల్లో టిక్కెట్ తీసుకునే సందర్భంలో తలెత్తె చిల్లర సమస్యకు టీఎస్ఆర్టీసీ పుల్ స్టాప్ పెట్టబోతోంది. ఇకపై సిటీ బస్సుల్లో యూపీఐ సేవలను వినియోగంలోకి చేబోతుంది.   

TSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. బస్సులో ప్రయాణించేటప్పడూ ఎదురయ్యే ప్రధాన సమస్య .. టిక్కెట్  తీసుకొనేటప్పడు సరిపడ చిల్లర లేకపోవడమే. ఈ చిల్లర సమస్యకు తెలంగాణ ఆర్టీసీ చెక్ పెట్టబోతుంది. ఇకపై నగరంలోని అన్ని రకాల సిటీ బస్సుల్లో యూపీఐ  ద్వారా  టికెట్ అందించే ప్రక్రియకు ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. ఈ విధానాన్ని ప్రవేశపెడితే.. ఇటు ప్రయాణీకులకు..  అటు ఆర్టీసీ కండక్టర్లకు కూడా ఉపయుక్తంగా మారనున్నది.  దీంతో సిటీ బస్సుల్లో చిల్లర సమస్య తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈక్రమంలోనే నగరంలో తిరిగే.. 2,500కు పైగా ఉన్న ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో యూపీఐ సేవల ద్వారా టికెట్ జారీ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు.  అయితే ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించిన జిల్లా సర్వీసు.. అంటే మెట్రో లగ్జరీ, ఏసీ బస్సుల్లో యూపీఐ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. అలాగే నగరంలోని ఎయిర్ పోర్టుకు తిరిగే ఏసీ బస్సుల్లోనూ క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్ జారీ చేస్తున్నారు. 

ఇప్పుడూ సిటీ బస్సుల్లో యూపీఐ ద్వారా టికెట్ జారీ చేసేందుకు బస్సుల్లో ఐ-టీమ్స్ యంత్రాలను అందుబాటులోకి తీసుకరానున్నది ఆర్టీసీ యాజమాన్యం. ఇప్పటికే ఐ టీమ్స్ యంత్రాలను పంపిణీ చేసే సంస్థతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు ఆర్టీసీ గ్రేడర్ జోన్ అధికారులు తెలిపారు. ఈ  పద్దతి విజయంగా సాగుతే..  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,300 బస్సుల్లో దశలవారీగా ప్రవేశ పెట్టేలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది.  
వాస్తవానికి  బస్సుల్లో టికెట్ తీసుకునే టప్పుడు చిల్లర సమస్య మమూలుగా ఉండదు. చిల్లర విషయంలో కండక్టర్లు, ప్రయాణీకులు గొడవలు పడిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ సమస్యను కాస్త తగ్గించడానికి టిక్కెట్ రేట్లను రూ. 10, 15, 10 ఇలా రేట్లు పెంచింది. అయినా  ఈ పూర్తిగా సెట్ కాలేదు. ఈ క్రమంలో  700 సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో ఐ-టిమ్స్ ను ప్రవేశ పెట్టారు. మిగిలిన 8,300 బస్సుల్లో సాధారణ టిమ్స్  సేవలు అందుబాటులో ఉండగా.. వాటిలో క్యాష్ లెస్ ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకరావాలని  ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. 

దసరాకు అదిరిపోయే ఆఫర్ .. 

దసరాకు స్వంత ఊళ్లకు వెళ్లాలని భావించే.. ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీ మధ్యలో ప్రయాణం చేసేవారికి ఈ ఆఫర్ ఉపయోగపడుతుంది. తిరుగు ప్రయాణంపై 10 శాతం డిస్కౌంట్ కల్పించనున్నారు. రిజర్వేషన్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ కోరుతోంది. 

PREV
click me!

Recommended Stories

అధికార కాంగ్రెస్ బిగ్ షాక్ .. మాజీ మంత్రి రాజీనామా..? అసలు కారణమేంటో తెలుసా? | Asianet News Telugu
KTR Comments on CM Revanth Reddy: అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పంచ్ లు| Asianet News Telugu