అన్న .. తొందరపడకు, మాట జారకు: రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్

Published : Dec 21, 2022, 11:10 AM IST
అన్న .. తొందరపడకు, మాట జారకు: రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్

సారాంశం

బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో 28 వేల సార్లు తన పేరు చెప్పించినా అబద్దం నిజం కాదని పేర్కొన్నారు. 

ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న సమీర్‌ మహేంద్రుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ్‌‌ రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి‌లతో పాటు పలువురి పేర్లను ప్రస్తావించింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరును మరోసారి ఈడీ ప్రస్తావించడం‌పై వార్తపత్రికల్లో వచ్చిన కథనాన్ని షేర్ చేసిన.. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆమెపై విమర్శలు చేశారు. 

కవితను లిక్కర్ క్వీన్ అని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ‘‘చార్జిషీట్‌లో లిక్కర్ క్వీన్స్ పేరు 28 సార్లు ప్రస్తావించబడింది’’ అని రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌పై స్పందించిన కవిత.. రాజగోపాల్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. రాజగోపాల్ అన్న తొందరపడి మాట జారకు అని పేర్కొన్న కవిత.. 28 వేల సార్లు తన పేరు చెప్పించినా అబద్దం నిజం కాదని పేర్కొన్నారు. 

 


‘‘రాజగోపాల్ అన్న .. తొందరపడకు , మాట జారకు !!. " 28 సార్లు " నా పేరు చెప్పించినా.. " 28 వేల సార్లు " నా పేరు చెప్పించినా.. అబద్ధం నిజం కాదు..’’ అని రాజగోపాల్ రెడ్డికి కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update: వీకెండ్‍లో కూల్ వెదర్..రానున్న రెండ్రోజుల్లో వర్షాలే వర్షాలు | Asianet News Telugu
Hyderabad: ఇక హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ అంతా అటు వైపే.. కొన‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం