వీడియో నాదే, బూతులు నావి కావు : టిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫరూక్

Published : Oct 09, 2017, 05:40 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
వీడియో నాదే, బూతులు నావి కావు : టిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫరూక్

సారాంశం

మహిళను చెప్పుతో కొట్టిన విషయమై స్పందించిన ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ వీడియోలో నేనే ఉన్నాను కానీ బూతులు నావి కావు నేను చెప్పు పైకి లేపనే లేదు. నేను కబ్జాలు చేసే రకం కాదు

ఒక మహిళపై బూతులు తిడుతూ చెప్పుతో దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ స్పందించారు. ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే చదవండి.

 

ఈ రోజు నా పై టీవీ ఛానళ్లలో నాపై వస్తున్న వార్తలు అబద్ధం. యూసుఫ్ అలీ అనే వ్యక్తి ఉదయం ఆరున్నరకు వచ్చి నా ఇంటి డోర్ కొట్టారు.  

యూసఫ్ అలీ అనే వ్యక్తి వెంట వచ్చిన ఒక మహిళ నామీద పరుష పదజాలంతో దూషించింది. ఆమె ఎవరో నాకు తెలియదు.

ఇళ్ళు ఖాళీ చేయడం లేదంటూ నన్ను తిట్టడం మొదలు పెట్టింది. ఆమె తిట్లతో నాకు ఆశ్చర్యం కల్గింది.

ఆరేళ్ల క్రితం ఇపుడు ఉంటున్న ఇంటి అద్దెకు సంబంధించి మహ్మద్ సమద్ అనే వ్యక్తి తో ఒప్పందం కుదుర్చుకున్నాను.

నెలకు 11 ,500 రూపాయల అద్దెకు ఒప్పందం కుదుర్చుకున్నాను.

నెల పూర్తి కాక ముందే నేను అద్దె చెల్లించే వాడిని. ఒకవేళ రెంట్ కోసం వాళ్ళు రాకుంటే నేనే ఫోన్ చేసే వాడిని.

కొన్ని నెలల నుంచి ikbal khan అనే వ్యక్తి అద్దె తీసుకెళ్తున్నారు. మళ్లీ మళ్లీ చెబుతున్నా నా ఇంటి కొచ్చిన ఆమె ఎవరో తెలియదు.

నాకు అసలు బూతులు రానే రావు. నా రాజకీయ జీవితం తెరచిన పుస్తకం లాంటిది.

నాకు కబ్జాలు చేసే అలవాటు లేదు. అయినా కబ్జాలు చేసే అలవాటుంటే ఇప్పటికే సొంత ఇల్లు కలిగి ఉండే వాడిని కదా? ఇల్లు ఖాళీ చేయమని నాకు ఎవరూ నోటీసు ఇవ్వలేదు.

మీడియాలో వచ్చే వీడియోలో ఉన్నది నేనే కానీ బూతులు మాత్రం నావి కావు. వేరేవాళ్ల మాటలు.

నేను చెప్పు లేప లేదు ..ఆమె నాపై పరుష పదజాలం ప్రయోగించింది.

నా ఇంటి యజమాని ఫోన్ నెంబర్లు ఇవి. మహ్మద్ సమద్ 98491 40135, ఇక్బల్ ఖాన్ 98499 35740.

వారిద్దరు అందుబాటు లోకి రావడం లేదు. అయినా న్యాయ పరంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకుంటా. చూస్తుంటే ఇందులో ఏదో కుట్ర దాగి ఉంది.

సిద్దిపేట లో నేను ఎలాంటి వాడినో ఎవరినడిగినా చెబుతారు. నేను వైట్ పేపర్ లాంటి వాడిని. నాకు ప్రస్తుతమున్న ఇంట్లో శాశ్వతం గా ఉండాలని లేదు.

నాలుగు నెలల్లో కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభం కాబోతున్నాయి.

నిజమైన ఇంటి యాజమానులు ,నాతో ఒప్పందం కుదుర్చుకున్న వారు ఇళ్ళు ఖాళీ చేయమంటే చేస్తా.

మహిళలంటే నాకు ప్రత్యేక గౌరవం ఉంది. నా పై ఆరోపణలు చేస్తున్న మహిళ వెనక ఎవరో ఉన్నారనే అనుమానం కలుగుతోంది.  అని మీడియాకు వివరించారు ఎమ్మెల్సీ.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/EaqWDi

 

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Airports in India : అతిపెద్ద విమానాశ్రయం మన హైదరాబాద్ దే.. ఎన్ని వేల ఎకరాల్లో ఉందో తెలుసా?
CM Revanth Reddy Speech: కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu