మంత్రి గంగుల ఆధ్వర్యంలో కరీంనగర్ నగర పాలక, కొత్తపల్లి పురపాలక సంస్థ సభ్యుల సన్నాహక సమావేశం జరిగింది. అభ్యర్థి ఎంపికలో ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ నిర్ణయమే ఫైనల్ అని తేల్చారు ఎన్నికల వ్యూహంపై కౌన్సిల్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.
కరీంనగర్ : డిసెంబర్ పదోతారీఖున నిర్వహించబోయే స్థానిక సంస్థల MLC Elections కోసం టీఆర్ఎస్ సిద్దమౌతుంది, అందులో బాగంగా ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఈ రోజు కరీంనగర్లో స్థానిక ఎమ్మెల్యే, మంత్రిGangula Kamalakar నిర్వహించారు.
undefined
కరీంనగర్ నగర పాలక, కొత్తపల్లి పురపాలక సంఘాలకు చెందిన డిప్యూటీ మేయర్, ఛైర్మన్, కార్పోరేటర్లు, కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు, మంత్రి గంగుల పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసారు, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ, గౌరవ ముఖ్యమంత్రి KCR, టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించే అభ్యర్థికి పార్టీలొ ఓటు హక్కు ఉన్న ప్రతీ ఒక్కరూ ఏక నిర్ణయంతో మద్దతు తెలపాల్సిందిగా సూచించారు.
సమావేశంలో పాల్గొన్న పాలకవర్గాల సభ్యులు ఈ ప్రతిపాధనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు, అభ్యర్థి నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ పార్టీ నిర్ణయమే శిరోదార్యమని, పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి సంపూర్ణ మద్దతు తెలుపుతామని మంత్రి ద్వారా అదిష్టానానికి తెలియజేసారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల నియోజకవర్గాలకు మంత్రి గంగుల ఎన్నికల ఇంచార్జిగా, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు మంత్రి కొప్పుల ఈశ్వరు బాధ్యులుగా ఉన్నారు.
హైదరాబాద్: మొయినాబాద్ జేబీఐటీలో విద్యార్ధి ఆత్మహత్య.. రెండు నెలల క్రితం జాయిన్, అంతలోనే
ఈ కార్యక్రమంలో కరీంనగర్ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ ఛైర్మన్ రుద్రరాజు, ఇరు పాలకవర్గాల సభ్యులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC Elections) మంగళవారం నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 12 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా.. డిసెంబర్ 10వ తేదీన పోలింగ్ (Polling) నిర్వహించనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాల చొప్పున, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. అయితే ఈ 12 స్థానాలు ప్రస్తుతం టీఆర్‌ఎస్ (TRS) చేతుల్లో ఉన్నవే. అయితే ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలు ఉంటుంది.
ఇక, ఈ ఎన్నికలకు సంబందించి.. నవంబర్ 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగుతుంది. ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఈ నెల 26న ఉపసంహరణకు అఖరి తేదీగా నిర్ణయించారు. డిసెంబర్ 10న పోలింగ్ జరగనుండగా.. డిసెంబరు 14న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.
స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్నా పురాణం సతీష్ కుమార్, భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు, భూపాల్ రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కల్వకుంట్ల కవిత పదవీకాలం జనవరిలో ముగియనుంది.