బీఆర్ఎస్ నేతలు రామన్న, కోనప్ప, నగేష్‌లకు తృటిలో తప్పిన ప్రమాదం.. అసలేం జరిగిందంటే..

Published : Jun 15, 2023, 04:50 PM IST
బీఆర్ఎస్ నేతలు రామన్న, కోనప్ప, నగేష్‌లకు తృటిలో తప్పిన ప్రమాదం.. అసలేం జరిగిందంటే..

సారాంశం

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కోనప్ప, మాజీ ఎంపీ నగేష్‌లకు తృటిలో ప్రమాదం తప్పింది. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కోనప్ప, మాజీ ఎంపీ నగేష్‌లకు తృటిలో ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదం నుంచి ముగ్గురు నేతలు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు.. ఈరోజు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంబోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న, సిర్పూర్‌(టీ) ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎంపీ జి నగేష్‌లు ఆదిలాబాద్ నుంచి నాగ్‌పూర్‌కు బయలుదేరారు. 

Also Read: చంచల్‌గూడ జైలులో వైఎస్ భాస్కర్ రెడ్డిని కలిసిన ఆయన కొడుకు అవినాష్ రెడ్డి

అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం మహారాష్ట్రలోని యావత్‌మాల్‌ జిల్లా పంధర్‌కవాడ-బోరి గ్రామాల మధ్య రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. వాహనానికి అడ్డం వచ్చిన పశువులను తప్పించే ప్రయత్నం‌లో డ్రైవర్ వాహనంపై నియంత్రణ  కోల్పోయాడు. ఈ ప్రమాదంలో వాహనం ముందు భాగం బాగా దెబ్బతింది. ఈ ఘటన తర్వాత ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కోనప్ప, జి నగేష్‌లు మరో వాహనంలో నాగ్‌పూర్‌కు బయలుదేరి వెళ్లారు. 

ఈ ఘటనకు సంబంధించి జోగు రామన్న ఓ వీడియో విడుదల చేశారు. ‘‘నాగ్‌పూర్‌లో జరిగే కేసీఆర్ సమావేశానికి హాజరవుతున్న సందర్భంగా రోడ్డుమీద ఆకస్మికంగా పశువులు అడ్డం రావడంతో చిన్న రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందరూ క్షేమంగా ఉన్నారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవలసినవసరం లేదు’’ అని జోగు రామన్న పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్