ఎమ్మెల్య వర్సెస్ సర్పంచ్ : వేధింపుల ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్.. నవ్యకు పోలీసుల నోటీసులు.. ఫోన్ సైలెంట్....

By SumaBala Bukka  |  First Published Jun 24, 2023, 2:18 PM IST

జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకిపురం సర్పంచ్ నవ్యల కేసులో పోలీసులు నవ్యకు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో ఆధారాలతో కలవాలని కోరారు.


వరంగల్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, సర్పంచ్ నవ్యల మధ్య నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య మీద జానకిపురం సర్పంచ్ నవ్య లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రెండు రోజుల క్రితం ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. అయితే,  ఈ ఆరోపణలను జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు సుమోటోగా స్వీకరించాయి. దీంతో కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. 

మహిళా కమిషన్లు ఈ కేసుకు సంబంధించిన విచారణ నివేదికను ఇవ్వాలంటూ పోలీసులను ఆదేశించింది. ఈ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  జానకీపురం సర్పంచ్ నవ్యకు పోలీసులు రెండు నోటీసులు జారీ చేశారు. నవ్య ఈ నెల 21వ తేదీన  ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో… ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఆయన పిఏ, నవ్య భర్త, ఎంపీపీల మీద ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన సాక్షాదారాలను రెండు రోజుల్లోగా సమర్పించాలని  కోరుతూ రెండు నోటీసులు జారీ చేశారు. 

Latest Videos

ఎమ్మెల్యే రాజయ్య వర్సెస్ సర్పంచ్ నవ్య : వేధింపుల కేసులో కీలక ట్విస్ట్.. పోలీసులకు ఫిర్యాదు...

దీనికి సంబంధించి మూడు రోజుల్లోగా సాక్షాలతో తమను సంప్రదించాలని.. విచారణకు సహకరించాలని ఏసీపీ కార్యాలయం నవ్యను కోరింది. ఫిర్యాదు టైంలో నవ్య మాట్లాడుతూ తనపై వేధింపులకు సంబంధించిన సాక్షాదారాలన్నీ తన దగ్గర ఉన్నాయని స్పష్టంగా తెలిపారు. ఈ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పిఏ శ్రీనివాస్, తన భర్తల మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, నవ్య ఫిర్యాదుపై పోలీసులు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలుస్తోంది.  

దీనిమీద విచారణ చేపట్టి, ఆ తర్వాత చర్యలు చేపట్టే పనిలో పోలీసులు ఉన్నట్లుగా సమాచారం. మరోవైపు నవ్య.. ఆ ఫిర్యాదుపై ఫోను లిఫ్ట్ చేయకుండా సైలెంట్ గా ఉంటున్నారని తెలుస్తోంది. మూడు నెలల క్రితం వీధింపుల మీద క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆ తర్వాత గ్రామాభివృద్ధికి ఇస్తానన్న రూ.25 లక్షలు ఇవ్వలేదని..  నయా పైస ఇవ్వకపోగా ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.  

అంతేకాదు బాండ్ పేపర్ మీద రూ.20లక్షలు అప్పుగా తీసుకున్నట్లు సంతకం పెట్టమని ఎమ్మెల్యేతో పాటు తన భర్త, ఎంపీపీ, ఎమ్మెల్యే పీఏ వేదిస్తున్నారని ఆ ఫిర్యాదులో సర్పంచ్ నవ్య పేర్కొంది.  ఆ నలుగురి మీద చర్యలు తీసుకోవాలని కోరింది.

click me!