టీఆర్ఎస్ మీద సీతక్క ఫైర్... గవర్నర్ తో కూడా అబద్దాలు మాట్లాడించింది...

By AN TeluguFirst Published Mar 15, 2021, 4:44 PM IST
Highlights

తెలంగాణ గవర్నర్ తమిళిసై తో కేసీఆర్ ప్రభుత్వం అసత్యాలు చెప్పించిందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సీతక్క మీడియాతో మాట్లాడుతూ, కరోనా టైంలో ప్రభుత్వ పనితీరును గవర్నర్ నేరుగా చూశారన్నారు. 

తెలంగాణ గవర్నర్ తమిళిసై తో కేసీఆర్ ప్రభుత్వం అసత్యాలు చెప్పించిందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సీతక్క మీడియాతో మాట్లాడుతూ, కరోనా టైంలో ప్రభుత్వ పనితీరును గవర్నర్ నేరుగా చూశారన్నారు. 

కానీ ప్రసంగంలో బాగా చేసినట్లు గవర్నర్ చేత సీఎం కేసీఆర్ గవర్నర్ తో సీఎం కేసీఆర్ చూపించారని చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో పేజీలు పెంచారు. కేసీఆర్ మీద పొగడ్తలు పెంచారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం అప్పులు పెంచి కొప్పులు పెడుతున్నట్లుగా చూపించారని ఎద్దేవా చేశారు. 

కేవలం అరురోజుల సమయంలో వందల కోట్ల బడ్జెట్ పై ఏం చర్చించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సీతక్క నిలదీశారు. సోమవారం తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిర్దారణ పరీక్షల అనంతరమే సభ్యులను సభలోకి అనుమతిచ్చారు. ఈ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిపై సౌందరరాజన్ ప్రసంగించారు. 

తెలంగాణలో టీఎస్ ఐపాస్ ద్వారా 14,252 కంపనీలకు అనుమతి లభించినట్లు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.  దీంతో 15.51 లక్షల ఉద్యోగాలు లభించడమే కాదు 2.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఐటీ సెక్టార్ భారీగా అభివ్రుద్దిని కనబర్చిందని... అత్యధిక స్టార్టప్స్ నెలకొల్పబడ్డాయన్నారు. రాష్ట్రం డిజిటల్ సర్వీసేస్ రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. 

click me!