బిఆర్ఎస్ కు గుడ్ బై... కాంగ్రెస్ కు బైబై : పోటీకి మాత్రం సై అంటున్న రేఖా నాయక్

By Arun Kumar P  |  First Published Oct 5, 2023, 4:38 PM IST

ఎమ్మెల్యే రేఖా నాయక్ బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరతారంటూ ప్రచారం జరుగుతుంటే ఆమె మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు. 


ఖానాపూర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బిఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో  తీవ్ర అసంతృప్తితో పార్టీ మారేందుకు సిద్దమైనట్లు ప్రచారం జరిగింది. బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో వెంటనే ఆమె బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ నుండి కూడా స్పష్టమైన హామీ రాకపోవడంతో ఇన్నిరోజులు ఏ నిర్ణయమూ తీసుకోకుండా వేచిచూసారు. కానీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో తాజాగా రేఖా నాయక్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

బిఆర్ఎస్ పార్టీకీ రేపే(శుక్రవారం) రాజీనామా చేయనున్నట్లు రేఖా నాయక్ తెలిపారు. తాను ఏ పార్టీలో చేరడంలేదని... రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఖానాపూర్ ప్రజలకు సేవ చేయడానికే మళ్ళీ పోటీ చేస్తున్నానని... వాళ్లే తనను గెలిపించుకుంటారని రేఖా నాయక్ పేర్కొన్నారు. 

Latest Videos

కాంగ్రెస్ పార్టీలో చేరతారనుకుంటే ఇలా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ రేఖా నాయక్ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో పలుమార్లు సంప్రదింపులు జరిపినా స్పష్టమైన హామీ రాకపోవడంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Read More  ఇదోరకం పొలిటికల్ క్యాంపెయిన్... బిఆర్ఎస్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వెలిసిన వాల్ పోస్టర్లు

కొద్ది రోజులుగా సన్నిహితులు, అనుచరులతో చర్చలు జరుపుతున్న రేఖా నాయక్ బిఆర్ఎస్ ను వీడటానికే సిద్దపడ్డారు. కానీ ఏ పార్టీలో చేరకుండా స్వతంత్ర  అభ్యర్థిగా పోటీచేయాలన్న ఆమె నిర్ణయం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. 

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రేఖానాయక్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా ఖానాపూర్ నుండే ప్రాతినిధ్యం వహించారు.కానీ  పలు కారణాలతో ఈ దఫా రేఖానాయక్ కాకుండా జాన్సన్ నాయక్ కు బీఆర్ఎస్ టిక్కెట్ కేటాయించారు. దీంతో  రేఖానాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆమె భర్త  శ్యాంనాయక్  కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆసిఫాబాద్  అసెంబ్లీ సీటు కోసం  శ్యాం నాయక్,  ఖానాపూర్ నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా  రేఖానాయక్  ధరఖాస్తులు సమర్పించారు. ఇద్దరికీ టికెట్ దక్కే అవకాశాలు లేకపోవడంతోనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 


 

click me!