సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ దసరా కానుక .. బోనస్‌గా రూ.711 కోట్లు , ఒక్కో కార్మికుడికి లక్షా 63 వేలు

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. వారికి రూ.711.18 కోట్ల బోనస్ ప్రకటించింది. కేసీఆర్ ఆదేశాలతో ఈ నెల 16న ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలో బోనస్ డబ్బులు జమ కానున్నాయి. 
 


సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. వారికి రూ.711.18 కోట్ల బోనస్ ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో సగటున ఒక్కో కార్మికుడికి రూ.1.53 లక్షలు బోనస్‌గా అందనుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈ నెల 16న ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలో బోనస్ డబ్బులు జమ కానున్నాయి. 

కాగా.. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో వచ్చిన లాభాల్లో 32 శాతం వాటాను కార్మికులకు ఇవ్వాలని గత నెలలో కేసీఆర్ నిర్ణయించారు. తద్వారా 42,390 మంది ఉద్యోగుల ఖాతాల్లో రూ.711 కోట్లు జమకానున్నాయి. గతేడాది రూ.368 కోట్లను బోనస్‌గా ఇవ్వగా.. ఈ ఏడాది సంస్థకు రూ.2,222 కోట్ల లాభం వచ్చింది. దీంతో కార్మికులకు ఇచ్చే వాటాను 30 నుంచి 2 శాతం పెంచాలని కేసీఆర్ సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. 

Latest Videos


 

click me!