సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ మెనూ ఖ‌రారు.. రేపు ప్రారంభించనున్న కేసీఆర్.. ఏరోజు ఏం ఉండనుందంటే..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘‘సీఎం అల్పాహార పథకాన్ని’’ అక్టోబర్ 6వ తేదీన ప్రారంభించనున్నారు. అయితే తాజాగా సీఎం అల్పాహార పథకం మెనూ ఖ‌రారైంది.
 

CM KCR will launch CM's Breakfast Scheme on 6th october here is the Breakfast Menu ksm

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘‘సీఎం అల్పాహార పథకాన్ని’’ అక్టోబర్ 6వ తేదీన ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లాలో మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం రావిర్యాల జ‌డ్పీహెచ్ఎస్‌లో ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనుండగా.. రాష్ట్రవ్యాప్తంగా ఇతర జిల్లాల్లో ఏకకాలంలో స్థానిక నాయకులు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పాఠశాలల ప్రారంభానికి 45 నిమిషాల ముందే అల్పాహారం అందివ్వ‌నున్నారు. ఇక, సీఎం అల్పాహార పథకం కోసం బడ్జెట్‌లో ప్రతి ఏడాది రూ. 400 కోట్లు కేటాయించనున్నట్టుగా ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. 

CM KCR will launch CM's Breakfast Scheme on 6th october here is the Breakfast Menu ksm

Latest Videos

అయితే తాజాగా సీఎం అల్పాహార పథకం మెనూ ఖ‌రారైంది. సోమ‌వారం – ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ ర‌వ్వ ఉప్మా.. మంగ‌ళ‌వారం – పూరి, ఆలు కుర్మ లేదా ట‌మాటా బాత్ విత్ ర‌వ్వ‌, చ‌ట్నీ.. బుధ‌వారం – ఉప్మా, సాంబార్ లేదా కిచిడి, చ‌ట్నీ... గురువారం – మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగ‌ల్, సాంబార్... శుక్ర‌వారం – ఉగ్గాని/ పోహా/మిల్లెట్ ఇడ్లీ, చ‌ట్నీ లేదా గోధుమ ర‌వ్వ కిచిడీ, చ‌ట్నీ... శ‌నివారం – పొంగ‌ల్/సాంబార్ లేదా వెజిట‌బుల్ పొలావ్, రైతా/ఆలు కుర్మ‌ అందివ్వనున్నారు. 

vuukle one pixel image
click me!