కెసిఆరే స్వయంగా దళితులను కించపరుస్తుండు

Published : Aug 12, 2017, 05:32 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
కెసిఆరే స్వయంగా దళితులను కించపరుస్తుండు

సారాంశం

కోదండరాం యాత్రను అడ్డుకోవడం దారుణం ఇసుక మాఫియా నడిపేది కెసిఆర్ కుటుంబమే నేరెళ్ల విచారణ కెటిఆర్ కనుసన్నల్లోనే నడుస్తున్నది.

తెలంగాణ సిఎం కెసిఆర్ పై సిఎల్పీ ఉప నేత జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కోదండరాం చేప్టటిన స్పూర్తి యాత్రను అడ్డుకోవడం దారుణమన్నారు.కోదండరాం మీదనేనా మీ నిర్బంధం అని నిలదీశారు. తెలంగాణ మంత్రివర్గంలో ఉన్న తుమ్మల, తలసాని, మహేందర్ రెడ్డి జెఎసి కంటే ఎక్కువగా తెలంగాణ ఉద్యమంలో పని చేశారా అని నిలదీశారు.

తెలంగాణ రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. స్వయంగా సిఎం కేసీఆరే దళితులను కించపరుస్తున్నారని విమర్శించారు. నేరెళ్ల ఘటనపై విచారణ కేటీఆర్ కనుసన్నల్లోనే జరుగుతుందన్నారు.

ఇసుక మాఫియాలో అంతా కేసిఆర్ కుటుంబ సభ్యులే భాగస్వాములుగా ఉన్నట్లు చెప్పారు. నేరెళ్లలో జనాలపై పోలీసులు దాడి చేసి నెలరోజులైనా ఇప్పటి వరకు మంత్రి కెటిఆర్ ఖండించకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. ఒక్క నెంబర్ మీద ఆరు లారీలు తిరగడం దారుణమన్నారు. ఇలా ఇన్నాళ్లు ఎలా తిరిగాయి.. ఎన్ని కోట్లు కొల్లగొట్టారో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.

జేఏసీ పోరాటం చేయకపోతే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతటి నిర్బంధం ఎప్పుడూ లేదన్నారు. పౌర హక్కులను కెసిఆర్ కాల రాస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణాలో రాచరిక పాలన నడుస్తోందని విమర్శించారు. 

 

PREV
click me!

Recommended Stories

అభిమాని కోరికతీర్చిన Pawan Kalyan.. గంటలోనే Niranjan కి ట్యాబ్, కుక్కపిల్ల | Asianet News Telugu
IMD Rain Alert : రుతుపవనాలు అలర్ట్, ద్రోణి ఎఫెక్ట్ .. ఈ ప్రాంతాల్లో ఇక వర్షబీభత్సమే