
హైదరాబాద్ : ఒక రాష్ట్ర మంత్రిపై murder కుట్ర చేయడం దారుణం అని TRS ఎమ్మెల్యే, పియుసి చైర్మన్ Jeevan Reddy మండిపడ్డారు. కుట్రలోని పాత్ర దారులు మాజీ ఎంపీ Jitender Reddy ఇంట్లో ఎలా ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు? జితేందర్ రెడ్డికి వారికి సంబంధం ఏంటి? kidnapల గురించి మాజీ మంత్రి DK Arunaకు ముందే ఎలా తెలుసు? అని ప్రశ్నించారు.
"
మా ప్రభుత్వం ఇలాంటి చర్యలను కుట్రలను ఉపేక్షించదంటూ విరుచుకుపడ్డారు. దోషులు ఎంతటి వారు అయిన శిక్ష తప్పదు అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి పనులు చేయడం సిగ్గు చేటు అన్నారు. సెక్షన్ 212 ప్రకారం నిందితులకు షెల్టర్ ఇచ్చిన వారూ కూడా దోషులే అవుతారన్నారు.
డీకే అరుణ,జితేందర్ రెడ్డిలపై కేసులు పెట్టాలని డీజీపీ, సిపిలను కోరుతున్నానన్నారు. దోషులకు బీజేపీ షెల్టర్ ఇవ్వడం సిగ్గు చేటని.. తెలంగాణ లో ఇలాంటి పనికి మాలిన రాజకీయాలు నడవవని హెచ్చరించారు.
కాగా, బుధవారం తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు గుర్తుతెలియని వ్యక్తులు పన్నిన కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. పేట్ బషీరాబాద్‌లో నిందితులను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర వివరించనున్నారు. శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రపన్నారన్న వార్తలతో తెలంగాణ ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
మంత్రితో పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్ గౌడ్‌లను హత్య చేయించేందుకు ఈ కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఫరూక్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చేందుకు ప్రయత్నించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఫరూక్ పేట్ బషీర్‌బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కుట్ర విషయం వెలుగులోకి వచ్చింది.
నిందితులను అరెస్ట్ చేసిన తరువాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర వివరాలను సైబరాబాద్ పోలీసులు మీడియాతో పంచుకున్నారు. ఫరూఖ్, హైదర్ అలీలు సుచిత్ర దగ్గర లాడ్జీలో వున్నారని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఫిబ్రవరి 25న సాయంత్రం ఫారుఖ్, హైదర్ అలీని నాగరాజు సహా కొందరు వ్యక్తులు చంపేందుకు వెంబడించారని సీపీ చెప్పారు. అయితే ఫారుఖ్, హైదర్ అలీలు తప్పించుకుని పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. గత నెల 26న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని.. వీరిని విచారించగా యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్ పేర్లు బయటకొచ్చాయని సీపీ వెల్లడించారు.
రాఘవేందర్ రాజు సహా మరికొందరు హత్యకు కుట్ర చేశారని నాగరాజు పేర్కొన్నారు. రాఘవేందర్ రాజు మున్నూరు రవి, మధుసూదన్ రాజు ఢిల్లీలో వున్నట్లు తేలిందని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. వీరి లోకేషన్ ట్రేస్ చేయగా... మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో వున్నట్లు తేలిందని సీపీ చెప్పారు. వీరిని ఢిల్లీలో అరెస్ట్ చేసిన హైదరాబాద్ తీసుకొచ్చామని రవీంద్ర పేర్కొన్నారు. రాఘవేందర్ రాజు, మున్నూరు రవి, మధుసూదన్ రాజులు మహబూబ్‌నగర్ నుంచి వైజాగ్ వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారని సీపీ చెప్పారు. వీరికి జితేందర్ రెడ్డి డ్రైవర్ పీఏ రాజు షెల్టర్ ఇచ్చినట్లు ఆయన చెప్పారు.