
నాచారం : ఓ వృద్ధురాలి eye sight పోగొట్టడానికి కుట్ర పన్నింది ఆమె కేర్ టేకర్. వృద్ధురాలిని అంధురాలిగా చేస్తే ఆమె ఇంట్లోని money, నగలు కాజేయవచ్చని ప్రణాళిక వేసుకుంది. అందుకోసం Harpic, Jhandu Bam కలిపిన ద్రావణాన్ని ప్రతిరోజు చుక్కల మందు పేరుతో ఆ వృద్ధురాలి కళ్ళలో వేసింది. కొన్ని రోజులకు ఆ వృద్ధురాలు కంటిచూపు కోల్పోయింది. దీంతో Old women ఇంట్లోని డబ్బు, నగలను ఆ కేర్ టేకర్ తీసుకుంది. తాజాగా, ఆ వృద్ధురాలి కుమారుడు విదేశాల నుంచి వచ్చాడు. తన తల్లిని. ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె కంట్లో విషప్రయోగం జరిగిందని వైద్యులు చెప్పడంతో కేర్ టేకర్ నిర్వాకం బయటపడింది. కేర్ టేకర్ ను అరెస్టు చేసిన పోలీసులు మీడియాకు వివరాలు తెలిపారు.
నాచారం స్నేహపురి కాలనీలోని శ్రీనిధి అపార్ట్మెంట్ లో నివసించే ఎస్ హైమవతి (73) అనే వృద్ధురాలికి ఆమె కుమారుడు శశిధర్ కేర్ టేకర్ గా మంచిర్యాలకు చెందిన పి భార్గవి (32) అనే మహిళను పనిలో పెట్టాడు. గత ఏడాది ఆగస్టు నుంచి హైమావతి వద్ద భార్గవి పనిచేస్తోంది. కుమారుడు శశిధర్ లండన్ లో ఉంటున్నాడు. కేర్ టేకర్ గా పనిచేస్తున్న సమయంలో హైమావతి వద్ద ఉన్న డబ్బు, నగలను గమనించిన భార్గవి.. ఎలాగైనా వాటిని కాజేయాలని పథకం వేసింది.
కళ్ళు కనబడకుండా చేస్తే సులభంగా నగలు, నగదు చోరీ చేయవచ్చని ఆమె కంటి చూపు లేకుండా చేసేందుకు కుట్ర పన్నింది. హైమావతి కంట్లో నుంచి నీరు కారుతుండడంతో దీన్ని అవకాశంగా తీసుకున్న భార్గవి చుక్కల మందుపేరుతో హార్పిక్, జండుబాం కలిపిన ద్రావణాన్ని రోజుకు నాలుగు సార్లు ఆమె కళ్ళల్లో వేసేది. దీంతో ఆమె కంటి చూపు పోయింది. ఇదే విషయాన్ని లండన్ లో ఉన్న ఆమె కుమారుడు శశిధర్ కు చెప్పింది. అతడిచ్చిన సమాచారంతో వచ్చిన పోలీసులు భార్గవిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె బ్యాగ్ లో హార్పిక్, జండుబాంలతో పాటు బంగారు గాజులు, పచ్చల హారం పోలీసులకు లభ్యమయ్యాయి.
ఇదిలా ఉండగా, నిరుడు జూన్ 7న ఇలాంటి దారుణమే ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని హరి నగర్ ప్రాంతంలో 75 ఏళ్ల మహిళను హత్య చేసి దోచుకున్నారనే ఆరోపణలతో ఆ ఇంట్లో డొమెస్టిక్ హెల్ప్ గా పనిచేస్తున్న వ్యక్తితో సహా మరోఇద్దరిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. 75 యేళ్ల సావిత్రి శర్మ, ఆమె భర్త ఇద్దరూ ఒంటరిగా హరినగర్ లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. సావిత్రిశర్మ క్యాన్సర్ తో బాధపడుతుండగా, భర్త మానసిక స్థితి సరిగా లేదు. ఈ క్రమంలో తమకు సాయంగా ఓ కేర్ టేకర్ ను నియమించుకున్నారు.
ఈ క్రమంలో సావిత్రిశర్మ అపస్మారకస్థితిలో ఆర్కిడ్ ఆసుపత్రిలో చేర్పించినట్లు జూన్ 1 న పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులకు ఆమె మాట్లాడే స్థితిలో లేదు కాబట్టి స్టేట్మెంట్ ఇవ్వలేదని డాక్టర్లు తెలిపారు. సావిత్రి శర్మ మెడమీద గొంతు పిసికినట్టుగా గుర్తులు ఉండడంతో అనుమానించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణను ప్రారంభించారు.