హీరోలమైనా లాబీయింగ్ చేసుకునేవాళ్ల ముందు జీరోలమే: జగ్గారెడ్డి

Published : Mar 09, 2020, 05:15 PM ISTUpdated : Mar 09, 2020, 05:20 PM IST
హీరోలమైనా లాబీయింగ్ చేసుకునేవాళ్ల ముందు జీరోలమే: జగ్గారెడ్డి

సారాంశం

 కొందరు నేతల కారణంగానే  పార్టీకి నష్టం వాటిల్లుతోందని  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. తమ స్వంత ప్రయోజనాల కోసం లాబీయింగ్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు


హైదరాబాద్:  కొందరు నేతల కారణంగానే  పార్టీకి నష్టం వాటిల్లుతోందని  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. తమ స్వంత ప్రయోజనాల కోసం లాబీయింగ్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

సోమవారం నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు.  కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు తమ స్వంత ప్రయోజనాల కోసం లాబీయింగ్ చేస్తున్నారన్నారు. కొంతమంది నేతలు పార్టీకి నష్టం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

తెలంగాణలో నాలాంటి వాళ్లు హీరోలమే,. కానీ ఢిల్లీలో లాబీయింగ్ చేసుకొనేవాళ్ల ముందు జీరోలమేనని ఆయన అభిప్రాయపడ్డారు.ఇప్పటికైనా సోనియాగాంధీ జాగ్రత్తలు తీసుకొంటే పార్టీ బాగుపడుతోందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు లాంటి నేతలకు రాహుల్ అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా ఆపడం బాధాకరమన్నారు.

111 జీవోపై టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రకరకాల విమర్శలు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 84 గ్రామాల్లో 111 జీవో కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ జీవోను ఎత్తివేసి రైతులకు న్యాయం చేయాలని  ఆయన డిమాండ్ చేశారు.  
 

PREV
click me!

Recommended Stories

Raja Saab : నా చావు కోరుకుంటున్నారా? రాజాసాబ్ టికెట్ల రచ్చ.. తెగేసి చెప్పిన మంత్రి కోమటిరెడ్డి
Sankranti: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.? ఇలా వెళ్తే ట్రాఫిక్ త‌ప్పించుకోవ‌చ్చు