అసెంబ్లీలో గవర్నర్‌ తమిళిసై తీరుపై బీజేపీ అసంతృప్తి.. : జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు..

Published : Feb 05, 2023, 04:31 PM IST
అసెంబ్లీలో గవర్నర్‌ తమిళిసై తీరుపై బీజేపీ అసంతృప్తి.. :  జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు..

సారాంశం

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ.. అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ తీరుపై బీజేపీ అసంతృప్తితో ఉన్నట్టు ఉందని  అన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ.. అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ తీరుపై బీజేపీ అసంతృప్తితో ఉన్నట్టు ఉందని  అన్నారు.  బీజేపీ తెలంగాణలో ఎన్ని గేమ్‌లు ఆడినా.. అధికారంలోకి రాదని విమర్శించారు. తనకు కాంగ్రెస్ కంటే బీజేపీ చరిత్ర ఎక్కువ తెలుసని కామెంట్ చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్‌గా తమిళిసై సౌందర్‌రాజన్‌ను మార్చే అవకాశాలు కూడా ఉన్నాయని అన్నారు. 

ఇదిలా ఉంటే, ఇటీవల అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగంపై స్పందించిన జగ్గారెడ్డి.. గవర్నర్ బయట చాలా నరికారని అన్నారు. పులి తీరుగా బయట గాండ్రించారని.. కానీ పిల్లి తీరుగా  సభలో ప్రసంగించారని కామెంట్ చేశారు. గత్యంతరం లేకే గవర్నర్ మాట్లాడారని చెప్పుకొచ్చారు. గవర్నర్  తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్ మధ్య రాజీ కుదిరిందని అన్నారు.  బీజేపీకి బీ టీమ్‌గా బీఆర్ఎస్ మారిందని  ఆయన ఆరోపించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!