‘‘నన్నే ఆపుతావారా?’’...సీఐపై నోరు పారేసుకున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు...

By AN Telugu  |  First Published Nov 8, 2021, 9:06 AM IST

వాహనాన్ని ఆపకుండా Guvvala Balaraju నేరుగా లోపలకు వెళ్లబోయాడు. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని అడ్డుకుని లోపలికి నేరుగా వెళ్లే అనుమతి లేదని చెప్పారు. దీంతో గువ్వల బాలరాజుకు కోపం వచ్చింది. పోలీసులపై మండిపడ్డారు. 


మహబూబ్ నగర్ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. పోలీసులపై నోరు పారేసుకున్నారు. ‘‘నన్నే ఆపుతావారా?’’ అంటూ ఓ సీఐతో దురుసుగా వ్యవహరించాడు. 

ఆదివారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి దశదినకర్మకు హాజరయ్యేందుకు గువ్వల మహబూబ్ నగర్ వచ్చారు. మంత్రి వ్యవసాయ క్షేత్రం సమీపంలో ప్రధాన రహదారి మీద ఎంపీ, ఎమ్మెల్యేల వాహనాలకు parking ఏర్పాటు చేశారు. 

Latest Videos

undefined

అయితే, అక్కడ వాహనాన్ని ఆపకుండా Guvvala Balaraju నేరుగా లోపలకు వెళ్లబోయాడు. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని అడ్డుకుని లోపలికి నేరుగా వెళ్లే అనుమతి లేదని చెప్పారు. దీంతో గువ్వల బాలరాజుకు కోపం వచ్చింది. పోలీసులపై మండిపడ్డారు. 

నన్నే ఆపుతావారా? అంటూ CI మీద విరుచుకుపడ్డారు. దీనికి గువ్వల బాలరాజుకు సీఐ ధీటుగా బదులిచ్చాడు. ‘మీరు ఎమ్మెల్యే అయితే policeలను పట్టుకుని ‘రా’ అనే అధికారం ఎవరిచ్చారు?’ అని గట్టిగా నిలదీశారు. ‘‘మీరు ‘రా’ అంటు మీ గౌరవం పెరగదు. మర్యాదగా మాట్లాడాలి’’ అని సూచించారు. 

హైదరాబాద్ లో దారుణం.. పదేళ్ల కూతురిపై తండ్రి లైంగిక దాడి.. దేహశుద్ది..

ఈ సందర్భంగా పోలీసులకు, ఎమ్మెల్యేకు మధ్య  తీవ్ర వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరుగుతుండడం గమనించిన సీనియర అధికారి ఒకరు సముదాయించి ఎమ్మెల్యేను లోపలకు పంపారు. కాగా, ఇదే కార్యక్రమానికి వచ్చిన సీఎం కేసీఆర్ అప్పటికే మంత్రి వ్యవసాయ క్షేత్రంలో ఉండడం గమనార్హం. 

శ్రీనివాస్ గౌడ్ కు సీఎం పరామర్శ...
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు పరామర్శించారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి Srinivas Goud తల్లి Shantamma అనారోగ్య కారణాలతో ఇటీవల మరణించారు. 

శాంతమ్మ దశదిన కర్మను ఆదివారం మహబూబ్‌నగర్‌లోని పాలకొండలో నిర్వహించారు. శాంతమ్మ దశదిన కర్మలో కేసీఆర్ పాల్గొన్నారు. శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ తల్లి సమాధి వద్ద Kcr నివాళులర్పించారు.  శాంతమ్మ మరణానికి దారి తీసిన పరిస్థితుల గురించి కేసీఆర్ అడిగి తెలుసుకొన్నారు. 

శాంతమ్మ సమాధి వద్దే మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కేసీఆర్ ముచ్చటించారు. కేసీఆర్ తో పాటు తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో పాటు ఉమ్మడ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. శాంతమ్మ స్మృతులతో ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు..

తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గించం .. తేల్చిచెప్పిన కేసీఆర్‌

గత నెల 29వ తేదీన రాత్రి శాంతమ్మకు గుండెపోటు రావడంతో ఆమె మరణించారు. శనివారం నాడు పాలకొండలోని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయక్షేత్రంలో శాంతమ్మ అంత్యక్రియలు నిర్వహించారు ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ మరణించారు.  ఒకే ఏడాదిలో తల్లీ, తండ్రి ఇద్దరూ మరణించారు.

click me!