రిపబ్లిక్ డే వేడుకలు ఎలా జరపాలో ప్రభుత్వానికి తెలుసు: ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి

Published : Jan 25, 2023, 02:04 PM IST
రిపబ్లిక్ డే వేడుకలు ఎలా జరపాలో  ప్రభుత్వానికి తెలుసు: ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి

సారాంశం

రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ గురించి ప్రభుత్వానికి తెలుసునని  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి  చెప్పారు. రాజ్ భవన్ లో  నిర్వహించే వేడుకలు కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు..  

హైదరాబాద్:రిపబ్లిక్ డే   వేడుకలు  ఎలా జరపాలో ప్రభుత్వానికి తెలుసునని  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి  చెప్పారు.బుధవారం నాడు  హైద్రాబాద్ లోని బీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో  ఆయన మీడియాతో మాట్లాడారు.  రాజ్ భవన్ లో  రిపబ్లిక్ డే ను కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు.  

అసెంబ్లీ ఆమోదించిన  బిల్లులు కూడా గవర్నర్  దగ్గరే పెట్టుకున్నారన్నారు.   రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఇబ్బంది పెడుతున్నారన్నారు. యూనివర్శిటీ నియామకాల బిల్లుు గవర్నర్ తొక్కి పెట్టారని ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. కేసీఆర్  పై, ప్రభుత్వంపై  గవర్నర్ విమర్శలు చేశారన్నారు. కానీ ఏనాడూ కూడా గవర్నర్  గురించి కేసీఆర్ మాట్లాడలేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు.  గవర్నర్ కు బీజేపీ  ప్రోటోకాల్ కావాలంటే తాము ఏమీ చేయలేమన్నారు. 

రైతులపై పన్నులు  వేసేందుకు  కేంద్రం కుట్రలు పన్నుతోందని ఆయన విమర్శించారు.  రైతులపై  పన్నులు వేసేందుకు  కేంద్రం తీసుకున్న  నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్  చేశారు.  రైతుల  ఆదాయం తగ్గి క్షోభ అనుభవిస్తున్నారన్నారు. ఎరువులపై ఉన్న సబ్సిడీలను కేంద్రం తొలగించిందని ఆయన చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు