సెక్యులర్ పార్టీలతో పొత్తులు: రాహుల్‌కు చిన్నారెడ్డి సూచన

By narsimha lodeFirst Published Aug 14, 2018, 12:09 PM IST
Highlights

సెక్యులర్ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీకి  మాజీ మంత్రి, వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి సూచించారు. మంగళవారం నాడు హైద్రాబాద్ హరితప్లాజాలో కాంగ్రెస్  పార్టీకి చెందిన 40 మంది సీనియర్లతో కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్‌గాంధీ సమావేశమయ్యారు.


హైదరాబాద్: సెక్యులర్ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీకి  మాజీ మంత్రి, వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి సూచించారు. మంగళవారం నాడు హైద్రాబాద్ హరితప్లాజాలో కాంగ్రెస్  పార్టీకి చెందిన 40 మంది సీనియర్లతో కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్‌గాంధీ సమావేశమయ్యారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విషయమై  ఆయన పార్టీ నేతలతో చర్చించారు.  తెలంగాణలో పార్టీ పరిస్థితి, టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు ఏ రకంగా వ్యవహరించాలనే  దానిపై పార్టీ నేతలతో ఆయన చర్చించారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం హైద్రాబాద్ వచ్చిన రాహుల్‌గాంధీ పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై 

తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు  అవసరమైతే సెక్యులర్ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి రాహుల్ గాంధీకి సూచించారు. 
ప్రచార కమిటీలు, మేనిఫెస్టో కమిటీలు ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీని చిన్నారెడ్డి కోరారు. 

పోటీ లేని నియోజకవర్గాల్లో   అభ్యర్థులను ప్రకటించాలని  చిన్నారెడ్డి రాహుల్‌ను కోరారు.  అయితే పొత్తుల విషయమై పీసీసీలకు స్వేచ్ఛను ఇవ్వనున్నట్టు  రాహుల్‌గాంధీ ప్రకటించారు. 

టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం నేతలు కోరుతున్న నేపథ్యంలో  కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి  రాహుల్‌ ను కోరడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

 

ఈ వార్తలు చదవండి

కాంగ్రెస్‌తోనే నా పెళ్లి జరిగింది: రాహుల్

వరుస సమావేశాలతో రాహుల్ బిజీ బిజీ...రెండో రోజు పర్యటన ప్రారంభం

రాహుల్ గాంధీ ఎదగాలి, స్క్రిప్ట్ చదువుతున్నాడు: కేసీఆర్

అవినీతికి హైద్రాబాద్ రాజధాని: కేసీఆర్‌పై రాహుల్ నిప్పులు

click me!