మూసీనదిలో మృతదేహాలు.. వీడిన మిస్టరీ

Published : Jan 24, 2019, 09:38 AM IST
మూసీనదిలో మృతదేహాలు.. వీడిన మిస్టరీ

సారాంశం

హైదరాబాద్ మూసీనదిలో బుధవారం ఇద్దరు మహిళల మృతదేహాలు కొట్టుకువచ్చిన సంగతి తెలిసిందే. 

హైదరాబాద్ మూసీనదిలో బుధవారం ఇద్దరు మహిళల మృతదేహాలు కొట్టుకువచ్చిన సంగతి తెలిసిందే. క్షుద్రపూజలు చేసి చంపేశారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. కాగా.. ఆ ఇద్దరు మహిళల చావు మిస్టరీ వీడింది. ఆ ఇద్దరు మహిళలు అక్కాచెల్లెళ్లు అని పోలీసులు గుర్తించారు.

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బరగూడెం గ్రామానికి చెందిన యాదమ్మ(50), సుమిత్ర(40)లు సోమవారం సాయంత్రం కల్లు కోసం కంచన్ బాగ్ వెళ్లారు.  సాయంత్రం 6 గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో యాదమ్మ భర్త రాజు ఫోన్‌ చేసి విచారించాడు. వస్తున్నామంటూ యాదమ్మ భర్తకు చెప్పింది. 

ఆ తర్వాత వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయి. తీరా.. అత్తాపూర్ మూసీ నదిలో శవాలై కనిపించారు. వారు హత్యకు గురయ్యారని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఈ జంట హత్యలకు సంబంధించిన నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మహిళల మెడలోని నగల కోసం హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

read more news

మూసీ నదిలో మహిళల మృతదేహాలు: క్షుద్రపూజల అనుమానం

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్