పగిలిన మిషన్ భగీరథ పైపులు

Published : Jun 17, 2017, 06:48 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
పగిలిన మిషన్ భగీరథ పైపులు

సారాంశం

తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పథకంలో నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు కలుగుతున్నాయి. సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలంలో గుర్జకుంట అనే గ్రామం సమీపంలో మిషన్ భగీరథ పైపులైన్ పగిలిపోయింది. దీంతో కొద్దిసేపు నీరు బయకు చిమ్మింది.

వెంటనే తేరుకున్న అధికారులు పగిలిన చోట పైపులకు మరమ్మత్తులు  చేపట్టడంతో నీటి ప్రవాహం ఆగిపోయింది. దీనిపై అధికారులు స్పందిస్తూ చాలా చిన్న లీకేజీ మాత్రమే అని  పేర్కొన్నారు. వెంటనే మరమ్మతులు చేశామన్నారు. మెయిన్ పైపులైన్ లీకు కాలేదని, సబ్ లైన్ కు లీకేజీ అయినట్లు వెల్లడించారు.

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు తెలంగాణ సర్కారు మిషన్ భగీరథ పై దేశ వ్యాప్తంగా ప్రచారం చేసింది. సర్కారు ప్రచారానికి తగ్గట్టుగానే ఇతర రాష్ట్రాల ప్రముఖులు వచ్చి మిషన్ భగీరథ పథకాన్ని అభినందించారు.

ఎన్నికల నాటికి ప్రతి ఇంటికీ నీళ్లివ్వకపోతే ఓట్లు అడగబోమని అసెంబ్లీ సాక్షిగా సిఎం సవాల్ చేశారు. కానీ ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పథకంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం  ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు