దారుణం : అదృశ్యమై.. అస్తిపంజరంగా మారి...

Published : Mar 16, 2021, 09:19 AM IST
దారుణం : అదృశ్యమై.. అస్తిపంజరంగా మారి...

సారాంశం

కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి ఆరునెలల తరువాత అస్థిపంజరంగా కనిపించాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో కలకలం రేపింది. 

కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి ఆరునెలల తరువాత అస్థిపంజరంగా కనిపించాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో కలకలం రేపింది. 

అదృశ్యమైన ఓ వ్యక్తిని ఆరు నెలల తరువాత అస్థిపంజరంగా కౌడిపల్లి మండలం తునికి గ్రామ శివారు కలీల్ సాగర్ చెరువు దగ్గర పశువుల కాపర్లు గమనించారు. ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తునికికి చెందిన యతిరాజుల గణేష్ (32)కు మతిస్థితిమితం సరిగా లేదు. ఆరు నెలల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయాడు. అప్పట్లో కుటుంబసభ్యులు అతను కనిపించడం లేదని ఠాణాలో ఫిర్యాదు చేశారు. 

కలీల్ సాగర్ చెరువు వద్ద మనిషికి సంబంధించిన అస్థిపంజరం కాపర్లకు కనిపించడంతో వారు కుటుంబీకులకు చెప్పారు. అక్కడ ఉన్న దుస్తులు, చెప్పుల ఆనవాళ్లను బట్టి గణేశ్ ది అని గుర్తించారు. భార్య లావణ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్