భాగ్యనగరంలో కలకలం.. ఐదుగురి ఆదృశ్యం.. కిడ్నాప్ చేశారా..? లేక..?

sivanagaprasad kodati |  
Published : Oct 01, 2018, 09:30 AM IST
భాగ్యనగరంలో కలకలం.. ఐదుగురి ఆదృశ్యం.. కిడ్నాప్ చేశారా..? లేక..?

సారాంశం

సెప్టెంబర్ నెలలో ఐదుగురు ఆదృశ్యం కావడం హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. అక్కాచెల్లెళ్లు, నర్సు, వ్యాపారి, వృద్ధురాలు కనిపించకుండా పోయారు. 

సెప్టెంబర్ నెలలో ఐదుగురు ఆదృశ్యం కావడం హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. అక్కాచెల్లెళ్లు, నర్సు, వ్యాపారి, వృద్ధురాలు కనిపించకుండా పోయారు. సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో నర్సుగా శిక్షణ తీసుకుంటున్న స్వప్న.. 28వ తేది ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లి తిరిగి రాలేదు...

చాంద్రాయణ గుట్ట హనుమాన్ నగర్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు తులసి, రాగిణి 14న దర్గాకు వెళుతున్నామని చెప్పి కనిపించకుండా పోయారు. డబీర్‌పురాకు చెందిన ఇమాంబి అనే మహిళ.. అజ్మీర్ వెళ్లొస్తానని చెప్పి సెప్టెంబర్ 13న వెళ్లారు. ఆ తర్వాతి నుంచి ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మారేడ్‌పల్లిలో ఈ-సేవా సెంటర్ నిర్వహిస్తున్న ప్రసన్న కుమార్ 26న బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. ఈ వరుస ఆదృశ్యాలపై పోలీసులు దృష్టి సారించారు. వీరిని ఎవరైనా అపహరించారా..? లేదంటే మరేదైనా కోణం వుందా అన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు