అమరుడి కుటుంబానికి సర్కారు టోకరా

First Published Apr 4, 2017, 11:46 AM IST
Highlights

తెలంగాణ అమరుల పరిహారాన్ని బుక్కేశారు

అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో ఆ అమరుల కుటుంబాలకు అడుగడుగునా అన్యాయమే జరుగుతోంది.

ఎన్నికల ముందు అమరుల కుటుంబాలకు అది చేస్తాం ఇది చేస్తాం అని అధికారంలోకి వచ్చిన పార్టీ ఇప్పుడు హామీలన్నీ మరిచిపోయింది.

 

తెలంగాణ రాష్ట్ర కోసం పోరాడిన అమరవీరుల ఎంపికలోనే చాలా అన్యాయం చోటు చేసుకుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు చెప్పిన అమరుల సంఖ్యకు అధికారంలోకి వచ్చాక చెబుతున్న అమరుల సంఖ్యకు చాలా తేడా వచ్చింది. ఆధారాలు, సాక్షాలు అంటూ అమరుల కుటుంబాలను తీవ్ర అవమానానికి గురిచేసింది.

 

అమరుల కుటుంబాలకు ఇచ్చిన పరిహారంలోనూ అదే విధమైన పనిచేశారు. దీనికి భర్తను కోల్పోయిన ఈ మహిళ ఆవేదనే సాక్షి.

 

శంషాబాద్ జిల్లా శంకర్ పల్లికి చెందిన పావని భర్త తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఉద్యమంలో పోరాడుతూనే అమరుడయ్యారు.

 

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అమరవీరుల కుటుంబాలకు ఆర్థికసాయం పేరుతో రూ. 10 లక్షలను ప్రకటించింది. అయితే పావని కుటుంబానికి మాత్రం రూ. 5 లక్షలే ఇచ్చింది. మిగిలిన రూ. 5 లక్షలు ఎక్కడికిపోయాయినేది ఆమె ఆవేదన.

 

అమరుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం అని చెప్పి రూ. 5 లక్షలే ఇచ్చారని. ఆర్థకభారంతో ఉన్న తమకు మొత్తం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆమె ప్రభుత్వానికి విజ్జప్తి చేస్తోంది.

 

click me!