‘అదుర్స్’ రిలీజుకు డబ్బు గుంజడంపై కెటిఆర్ చర్చకు సిద్దమా

First Published Apr 4, 2017, 7:35 AM IST
Highlights

అదుర్స్ చిత్రం విడుదల కాకుండా అడ్డుకున్నారు.

పెద్డ మొత్తం లో డబ్బు ముట్టాక విడుదలకు అంగీకరించారని సంపత్ ఆరోపించారు.

దీనిమీద తాను బహిరంగ చర్చకు సిద్ధమని కూడా సవాల్ విసిరారు.

కాంగ్రెస్ పార్టీ కెటిఆర్ తండ్రి తాత పుట్టక ముందునుంచే ఉందని,

దానిని ఖతం చేయడం ఎవరి తరం కాదని సంపత్ అన్నారు.

అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్  రాష్ట్ర ఐటి మంత్రి కెటి రామారావు పై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు, తాను చేసిన విమర్శలన్నింటిమీద బహిరంగ చర్చరకు కూడా సిద్దమని సవాల్  విసిరారు.

కాంగ్రెస్ ది ముగిసిన కథఅని, తెలంగాాణా అభివృద్ధికి  కేసులు వేసి  ఆటంకం కలిగిస్తున్నదని నిన్న వికారాబాద్ కెటిఆర్ చేసిన తీవ్ర విమర్శలకు ఆయన స్పదించారు.

 

 సంపత్ చేసిన విమర్శ ఇది :

 "తెలంగాణా ఐటి,మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిపక్షానికి వ్యతిరేకంగా మాట్లాడే విధానం రాజకీయాలకు మచ్చతెచ్చేలా ఉంది.

ఇంతటి పొగరబోతు నేతలను నేను చూడలేదు.

కేటీఆర్ తండ్రి, తాత పుట్టకముందే కాంగ్రెస్ పుట్టింది.

కాంగ్రెస్ ఖేల్ ఖతం అన్నవారు చాలామంది ఖతం అయ్యారు.

ఇంత కళ్లు నెత్తికెక్కిన మాటలు మంచిది కాదు.

మీకు దక్కిన  అధికారం కాంగ్రెస్ భిక్ష..." అని సంపత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

అంతేకాదు,  కుమారుడి రాజకీయ ప్రస్థానం గురించి కెసిఆర్ అన్నమాటలను కూడా సంపత్ గుర్తు చేశారు.

 

"నా బిడ్డ, కొడుకు రాజకీయాల్లోకి రారు అని 2008 జనవరిలో నల్గొండలో కేసీఆర్ చెప్పారు. నాలుగు లక్షల జీతం ఉద్యోగాన్ని వదులుకుని ఇప్పుడు నాలుగు వేల కోట్లు సంపాదించావు.     మీ కుటుంబ సభ్యులు   అదుర్స్ సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించారు.పెద్దమొత్తంలో సొమ్ముముట్టాక ఊరుకున్నారు," అని ఆరోపించారు.

ఎవరెవరిని ఎలా బ్లాక్ మెయిల్ చేశారో నేను చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు.       

            

తెలంగాణకు పట్టిన కల్వకుంట్ల గబ్బును 2019 కాంగ్రెస్ అనే సబ్బుతో కడుగుతామని తీవ్రస్థాయిలో హెచ్చరిక చేశారు.

click me!